భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలి - భాను బొజ్జ

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలి - భాను బొజ్జ

భువనగిరి జూలై 27 (ముద్ర న్యూస్):- గత కొద్ది రోజులుగా ఏడ తెరపలేని భారీ వర్షాలు కురుస్తుండటంతో కాలనీలు పట్టణాలు పూర్తిగా జలమయంగా మారుతూ వున్నాయి,  ప్రజలు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని రాయగిరి కి చెందిన యువజన నాయకుడూ భాను చందర్ బొజ్జ అన్నారు, విద్యుత్తు స్థంబలకు దూరంగా వుండాలని , చిన్న పిల్లలను ఎట్టి పరిస్థితుల్లో సైతం ఇంటి నుండి బయటకు రాకుండా పంపకుండా తల్లి తండ్రులు జాగ్రత్త పాటించాలని అని అన్నారు, పెద్ద వారు కూడా అత్యవసర పనుల కోసం  మాత్రమే రావాలని కోరారు, సిజాన్ మార్పుతో వాతావరణం లో వచ్చే మార్పుల వల్ల వైరల్ జ్వరాలు వచ్చే అవకాశాలు వున్నాయి కావున ఇల్లు మరియు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు, మి చుట్టూ పక్కల అత్యవసర పరిస్థతుల్లో పోలీస్ మరియు మున్సిపల్, జిహెచ్ఎంసి, సిబ్బందికి ఫోన్ ద్వారా సమాచారం అందించాలని అన్నారు.