ఉదృతంగా ప్రవహిస్తున్న మోత్కూర్ బిక్కేరు వాగు.

ఉదృతంగా ప్రవహిస్తున్న మోత్కూర్ బిక్కేరు వాగు.
  • జలమయమైన మోత్కూర్ ప్రధాన రహదారులు.
  • దాచారంగ్రామంలోఈదురుగాలులకు కరెంటు స్తంభాలు కూలి విద్యుత్ అంతరాయం .
  • జేసిబి సహాయం తో సహాయక చర్యలు చేపట్టిన మునిసిపల్ కమిషనర్ శ్రీకాంత్.


మోత్కూర్ (ముద్ర న్యూస్ ):ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మోత్కూర్  బిక్కేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది.చుట్టుపక్కల రైతులు, అటుగా వెళ్లే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని ఎస్ ఐ ఏమిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, మునిసిపల్ కమిషనర్ సి శ్రీకాంత్ లు అన్నారు.మోత్కూర్ లోని ప్రధాన రహదారులుపూర్తిగా  జలమయమయ్యాయి.

స్థానిక ఎస్బిఐ బ్యాంకు సమీపంలో వర్షపు నీరు భారీగా రోడ్డుపై చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు .స్థానిక టీవీఎస్ షోరూం సమీపంలో వర్షపు నీరు ఇండ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని జెసిబి సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు.

ఎస్సై ఎమిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఎస్బిఐ ప్రక్కన చిన్న పిల్లల ఆసుపత్రి ఉండడంతో ఆసుపత్రికి వెళ్లే చిన్నపిల్లల తల్లిదండ్రులకు దగ్గరుండి చిన్నపిల్లల తల్లిదండ్రులను చిన్న పిల్లలను ఆసుపత్రికి తరలించి సహాయక చర్యలు చేపట్టారు. మండలంలోని దాచారం గ్రామంలో కరెంటు స్తంభాలు కూలి గ్రామంలో గురువారం మధ్యాహ్నం వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. విద్యుత్ శాఖ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి శుక్రవారం మధ్యాహ్నం వరకు విద్యుత్తును పునరుద్ధరించారు. దాచారం గ్రామంలోని రామసముద్రం చెరువులో మత్స్యకారులు వరదకు చేపలు బయటికి వెళ్లకుండా వలలు అడ్డం కట్టారు.