కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వర్షాభావ ప్రాంతాల పరిస్థితులను సమీక్షించిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర

కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వర్షాభావ ప్రాంతాల పరిస్థితులను సమీక్షించిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర
  • జలాశయాల వద్దకు ఎవరు వెళ్లకుండా  ముందు జాగ్రత్త చర్యలు
  • చెరువులు, ట్రాఫిక్ రద్దీ... తదితర ప్రాంతాల ప్రజలకు సీపీ సూచనలు

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి:-భారీ వర్షాల నేపద్యంలో పరిస్థితులను సైబరాబాద్ పోలీస్ కమీషనర్  స్టీఫెన్ రవీంద్ర పరిశీలించారు.అడిషనల్ సీపీ అవినాష్ మహంతి, ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ నాయక్ తో కలిసి గురువారం  సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉన్న బిగ్ స్క్రీన్ పై లైవ్ లో సీసీటీవీ లను మానిటర్ చేసి సైబరాబాద్ లోని అన్ని ప్రాంతాల వాస్తవ పరిస్థితులను పరిశీలించారు. పబ్లిక్ సేఫ్టీ - ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ సెంటర్ (PSIOC) సెంటర్ నుంచి చెరువులను పరిశీలించారు.

ఈ సందర్భంగా సీపీ గారు మాట్లాడుతూ  ట్రాఫిక్ సిబ్బంది అంతా ఫీల్డ్ లోనే ప్రజలకు ఉన్నారని, ఎటువంటి సమస్యా రాకుండా విధులు నిర్వర్తిస్తున్నారాన్నారు.వర్షంలో వాహనదారులకు ట్రాఫిక్ జామ్ లేకుండా వాహనాలు ముందుకు సాగేలా అధికారులు సిబ్బందితో కలిసి పని చేయాలన్నారు.ఐఎండి వాతావరణ శాఖ సూచనల మేరకు భారీ వర్షాలు ఉన్న కారణంగా ఐటీ ఉద్యోగులను మూడు షిఫ్టులవారీగా పంపించేందుకు ఇప్పటికే కంపెనీలతో మాట్లాడా మన్నారు. ఇది మరో రెండు వారాలు కొనసాగిస్తున్నామన్నారు.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు అవసరం ఉంటేనే బయటకు రావాలని, అనవసరంగా బయటకు రావద్దన్నారు.ప్రజలు ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలని, పోలీసు, జి హెచ్ ఎం సి వారి సూచనలను పాటించాలన్నారు.

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టుల చెరువులు కుంటలు పూర్తిగా నిండాయని ఈ జలాశయాల వద్దకు ఎవరు వెళ్లకుండా తగు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. వరద ఉధృతి ప్రవహించే వద్దకు ప్రజలు వెళ్లకుండా ఉండేందుకు ప్లాస్టిక్ కోన్స్,  భారికేడ్స్ హెచ్చరిక గల ఫ్లెక్సీలను ఏర్పాటు, ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా ట్రాఫిక్ డైవర్షన్ లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.రైతులు పొలాల్లో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తగా ఉండాలన్నారు. వర్షాలు పడేటప్పుడు విద్యుత్తు స్తంభాలను గాని వైర్లను గాని చేతులతో తాకకుండా ఇతర జాగ్రత్త చర్లపై సమాచారం మాధ్యమాల ద్వారా ప్రజలను చైతన్య పర్చాలని ఆదేశించారు.  వర్షాలకు కల్వర్టులు చిన్నచిన్న బ్రిడ్జ్ ల వద్ద నీరు ప్రవహిస్తున్నప్పుడు వాహనాలతో దాటడానికి సాహసం చేయరాదన్నారు.నిండిన చెరువులు మత్తల్ల  వద్దకు ప్రజలు వెళ్లకుండా జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు.ప్రజలకు పోలీసులు 24 గంటలు అందుబాటులో ఉంటారని సహాయం కోసం డయల్ 100 కి లేదా స్థానిక పోలీసులకు గానీ సమాచారం అందించిన వెంటనే తగు సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుందని స్పష్టం చేశారు.సీపీ వెంట సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ సింగన్వార్ కల్మేశ్వర్,  సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి శ్రీహర్షవర్ధన్ , మాదాపూర్ డీసీపీ  సందీప్, ఏడీసీపీ రవి కుమార్, సీఎస్ డబ్ల్యూ ఏడీసీపీ శ్రీనివాస్ రావు, ఇన్ స్పెక్టర్లు నర్సింగ్ రావు, జగదీష్ ఇతర అధికారులు పాల్గొన్నారు.