వీడియో - అర్థరాత్రి లారీ భీభత్సం

  • తాగిన మైకంలో డీసీఎం ను డీ కొట్టిన లారీ
  • ప్రమాద స్థలంలో ఇద్దరు, హాస్పిటల్ లో ఇద్దరు మొత్తం నలుగురి మృతి
  • ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో తుర్కా యంజాల్ చౌరస్తా సమీపంలో ఘటన
  • బతుకుదెరువుకు డీజే ఆపరేటర్, డీజే లేబర్ గా చేస్తూ తిరిగి వస్తున్న ఇద్దరు, క్యాటరింగ్ చేసి వాస్తు ఒకరు, శుభకార్యానికి వెల్లోస్తున్న ఒకరు మృత్యువాత 

ఇబ్రహీంపట్నం, ముద్ర : తాగిన మైకంలో లారీని అతి వేగంగా నడుపుతూ డీసీఎం వాహనాన్ని డీ కొట్టడంతో ప్రమాద స్థలంలో ఇద్దరు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మొత్తం నలుగురు మృత్యువాతపడ్డారు. ఆదిభట్ల సీఐ రవి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం గురువారం అర్థరాత్రి 1.22కి సమయంలో తుర్కాయంజాల్ చౌరస్తా కు సమీపంలోని తులిప్స్ హోటల్ లో ఒక రిసెప్షన్ లో క్యాటరింగ్ చేసి తిరిగి ఇంటికి వెళ్ళే క్రమంలో నాగాసముద్రం సాయి రెడ్డి, లింగరాజు, శివారెడ్డి సాగర్ రోడ్డుపై ఇబ్రహీంపట్నం నుండి వచ్చే వాహనాలను లిఫ్ట్ అడుగుతున్నారు. అదే సమయంలో ఇబ్రహీంపట్నంలో ఒక డీజే ఈవెంట్ ముగించుకొని డీజే పరికరాలతో AP 31 TT 1204 నంబర్ గల డీసీఎం డ్రైవర్ హైదరాబాద్ వైపు వెళ్తున్న సమయంలో లిఫ్ట్ అడుగుతున్న వారిని చూసి వాహనాన్ని ఆపి ఎక్కించుకుంటున్న సమయంలో మాచర్ల నుండి ఇంజాపుర్ కు సిమెంట్ లోడ్ తో TS 15 UA 2851 నంబర్ గల లారీ డ్రైవర్ రవీందర్ తాగిన మైకంలో వేగంగా వెళ్తూ డీసీఎం ను వెనుక నుండి డీ కొట్టింది. ఢీ కొట్టిన వేగానికి ఢీసీఎం పూర్తిగా ధ్వంసం అయింది. అందులోని డీజే పరికరాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి.ఈ ప్రమాద స్థలంలో ఇద్దరు, ఆసుపత్రిలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పాత మల్లయ్య పాలెంకు చెందిన ఎల్బీ నగర్ లో నివాసముండే కేటరింగ్ పనిచేసే నాగసముద్రం సాయి రెడ్డి(22), నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తోటపల్లి కి చెందిన తుమ్మోజు లక్ష్మయ్య(52), నగరంలోని జియాగుడకు చెందిన డీజే ఆపరేటర్ అహినోల్ల మహేష్ కుమార్(23), వేంపల్లి మహేష్ (52) లు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. త్రాగిన మైకంలో వాహనం నడిపే నలుగురి మరణానికి కారణమైన లారీ డ్రైవర్ ను బ్రీత్ అనలైజర్ టెస్ట్ కు తరలించగా 161ఎంజీ ఆల్కహాల్ శాతం వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.