వైఎస్సార్​ మత్స్యకార భరోసా నిధులు విడుదల చేసిన  ఏపీ సీఎం వైఎస్​ జగన్​

వైఎస్సార్​ మత్స్యకార భరోసా నిధులు విడుదల చేసిన  ఏపీ సీఎం వైఎస్​ జగన్​

ఏపీలో వైఎస్సార్​ మత్స్యకార భరోసా నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​. వరుసగా ఐదో ఏడాది నిధులు విడుదల చేశారు. వేట విరామంతో మత్స్యకారులు ఉపాధి కోల్పోయారు. ఒక్కొక్కరి ఖాతాలో 10 వేల రూపాయల చొప్పున జమ చేశారు. 1,23,519 మత్స్యకార కుటుంబాలకు రూ. 123.52 కోట్ల సహాయం అందించారు. గత పాలనలో మత్స్యకారులకు అరకొర సాయం చేసేవారని అన్నారు జగన్​. గత పాలనలో రూ. 4 వేలు ఇస్తే ఇప్పుడు రూ. 10 వేలు ఇస్తున్నామన్నారు. వేటాడుతూ ఎవరైనా మత్స్యకారులు మృతి చెందితే గతంలో రూ. 5 లక్షలు పరిహారం ఇచ్చేవారని ఇప్పుడు పరిహారాన్ని రూ. 10 లక్షలకు పెంచామని చెప్పారు. ఓఎన్​జీసీ పైప్​లైన్​తో ఉపాధి కోల్పోయిన 23, 548 మందికి రూ. 108 కోట్ల సాయం అందించామని చెప్పారు. ఓఎన్​జీసీ పైప్​లైన్​తో 23,458 మంది జీవనోపాధి కోల్పోయారని అన్నారు. 4 కొత్త పోర్టులు, 10 ఫిషింగ్​ హార్బర్లు, 6 ఫిష్​ ల్యాండింగ్​ సెంటర్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. రూ. 3,800 కోట్లతో కొత్తగా 10 ఫిషింగ్​ హార్బర్లు , 6 ఫిష్​ ల్యాండింగ్​ సెంటర్లు నిర్మిస్తున్నామన్నారు.