వీడియో - షార్ట్ సర్క్యూట్ తో వాహనం దగ్ధం

  •  షాద్ నగర్ రాంనగర్ వద్ద ఘటన 
  •  పూర్తిగా దగ్దం అయిన కారు 
  •  సంఘటన స్థలానికి చేరుకుని మంటలు అర్పిన అగ్నిమాపక సిబ్బంది 

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని రాంనగర్ కాలనీలో షార్ట్ సర్క్యూట్ తో "చవర్ లెట్ ఎంజాయ్" వాహనం దగ్ధం అయ్యింది. కొందుర్గు మండలానికి చెందిన నగేష్ కు చెందిన ఎంజాయ్ వాహనం నంబర్ టిఎస్ ఓ7 యూసీ 8997 షార్ట్ సర్క్యూట్ కు గురైందని వాహనం డ్రైవర్ అశోక్ తెలిపారు. వాహనం దివ్య శక్తి పేపర్ మిల్ లో అద్దెకు నడుస్తుందని డ్రైవర్ అశోక్ పేర్కొన్నారు. ఉదయం రాంనగర్ లో తన ఇంటి నుండి కంపెనీకి బయలుదేరగా కొద్ది దూరం వెళ్ళాక వాహనంలో పొగలు రావడం ప్రారంభమయ్యాయని, కారు ఆపి దిగి బానట్ లేపి చూసేలోపే మంటలు వచ్చాయని డ్రైవర్ అశోక్ తెలిపారు. మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, కారు మొత్తం మంటల్లో దగ్ధమైందని వాపోయాడు. స్థానికులు పలువురు వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారని సమాచారాన్ని అగ్నిమాపక సిబ్బందికి చేరవేయగా వాళ్ళు వచ్చి మంటలు ఆర్పారని తెలిపారు. ఈ సంఘటనలో ఎవరికి ప్రాణాపాయం కలగలేదు..