భారీ వర్షంతో రుద్రoగి మండలo అతలాకుతలం...

భారీ వర్షంతో రుద్రoగి మండలo అతలాకుతలం...
  • తెగిన మాటు కట్టా..
  • నీట మునిగిన పంట పొలాలు..
  • ప్రమాదం అంచులో గోలేపులొద్ది..
  • నిలిచిన వేములవాడ కోరుట్ల రాకపోకలు..

ముద్ర,రుద్రoగి:రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రoగి మండల కేంద్రంతో పాటు మానాల గ్రామంలో భారీ ఎత్తున వర్షం కురుస్తుంది..అధికారులు తెలిపిన వివరాలు రుద్రoగి మండల కేంద్రంలో 80 మిల్లి మీటర్, మానాల పరిధిలో 91 మిల్లీ లీటర్ వర్షం కురిసినట్లు తెలిపారు..కాగా ఎడతెగేరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చిన్న మల్లయ్య అనే వ్యక్తి ఇల్లు కూలిపోయింది.

అలాగే మానాల తాతమ్మ వాగు, కొచ్చాగుట్ట తండా ఒర్రె ఉధృతంగా ప్రవహించడంతో రుద్రంగి కి రాకపోకలు నిలిచిపోయయి..కోరుట్ల వేములవాడ ప్రధాన రహదారి గండి వెంకటేశ్వర్ల ఆలయం వద్ద వరదనీరు ఎక్కువగా ప్రవహించడం వల్ల పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.నాగరం చెరువు కు ప్రధాన వరద కాలువ అయిన మాటు కట్ట తెగిపోవడంతో పెద్ద ఎత్తున పంట పొలాలు నీట మునిగి నంది వాగులోకి పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో నంది వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది..దింతో కోరుట్ల వేములవాడ రాకపోకలు నిలిచిపోయాయి.పోలీసులు  మాట్లాడుతూ ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని అలాగే చెరువులు వాగులు ఒర్రెలు ప్రవహిస్తున్నా చోటికి ప్రజలు ఎవ్వరు వెళ్లకూడదని సూచించారు..ఇంతటి భారీ వర్షంలోను పోలీసులు విధులు నిర్వహిస్తు ప్రజలను అప్రమత్తం చేస్తు ఎక్కడిక్కడి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్న పోలీసులకు అధికారులకు ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.