రాజన్నసిరిసిల్ల జిల్లా లో ఎడతెరిపి వర్షాలు

రాజన్నసిరిసిల్ల జిల్లా లో ఎడతెరిపి వర్షాలు
  • జలమయమైన సిరిసిల్ల లోతట్టు ప్రాంతాలు
  • పొంగిపోర్లుతున్న వాగులు, వంకలు.. నిండిన చెరువులు,కుంటలు
  • చంద్రంపేట ఈదుల చెరువుకు పడ్డ బుంగ.. లోతట్టు ప్రాంతాలను అలర్ట్ చేసిన అధికారులు

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల:రాజన్నసిరిసిల్ల జిల్లాలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కార్మిక వాడలు, లోతట్టు ప్రాంతాలు జలమయమై పోయాయి. శాంతినగర్, శ్రీనగర్ కాలనీ, సంజీవయ్యనగర్, అనంతనగర్, పాత బస్టాండ్ ప్రాంతలోని సిరిసిల్ల టూ కరీంనగర్ ప్రధాన రహదారి జలదిగ్బందంలో చిక్కుకున్నారు. ప్రమాదంగా ప్రహిస్తున్న వరదనీటి వైపు వాహనాలు వెళ్లకుండా పోలీసులు రోడ్డు మూసి వేశారు. ముంపు ప్రాంతాల వారిని సురక్షి ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వరద ముంపు ప్రాంతాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జింద కళచక్రపాణి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, పట్టణధ్యక్షులు జిందం చక్రపాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, నాయకులు బొల్లి రాంమోహన్, మున్సిపల్ కమీషనర్ సమ్మయ్యలు సందర్శించారు. పరిస్థితిని సమీక్షించారు.

శ్రీనగర్ కాలనీవాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చంద్రంపేట ఈదుల చెరువుకు వరద నీటి ఉదృతి ఎక్కువగా ఉండటంతో మత్తడికి నిర్మాణ పనుల వద్ద బుంగ పడింది. ఈ క్షణంలోనైన కట్ట తెగే పరిస్తితి ఉండటంతో లొతట్టు ప్రాంతాలైన శాంతినగర్, శ్రీనగర్ కాలనీవాసులను అధికారులు, పోలీసులు అలర్ట్ చేశారు. జిల్లా వ్యాప్తంగా సహాయక చర్యలు చేపట్టిన జిల్లా జలమయమయ్యే ప్రాంతాలలోని ప్రజలను పునరావాస కేంద్రానికి తరలిస్తున్నారు.నర్మల ఎగువ ఎగువ మానేరు నీటి ఉధృతి ఎక్కువ స్దాయిలో ఉండటంతో ఎగువ మానేరు ప్రాంత  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,అటు వైపుగా ఎవరు వెల్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. దారులు మూసివేశారు. ప్రజలు ప్రమాదాల భారీన పడకుండా వంతెనలపై రాకపోకలను నిషేధించి బారికేడ్లు,ఫ్లెక్సీ లు ఏర్పాటు చేసి గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు.12 మందితో కూడిన  జిల్లా డీఆర్ఎస్ టీమ్ 24 గంటలు అందుబాటులో ఉంటుందన్నారు.పిల్లలు, యువకులు సెల్ఫీలు తీసుకోవడానికి,ఈతలు కొట్టడానికి నీటి ప్రవాహాల దగ్గరికి వెళ్లకుండా తల్లిదండ్రులు దృష్టి సారించాలని పోలీసులు కోరారు. విపత్కర సమయాల్లో సహాయం కోసం డయల్100కి లేదా దగ్గరలో ఉన్న పోలీస్ వారికి సమాచారం అంధిస్తే తక్షణ సహాయక చర్యలు చేపడుతామని ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.