గీతా కార్మికుల అభివృద్ధికి కృషి చేస్తా

గీతా కార్మికుల అభివృద్ధికి కృషి చేస్తా

నూతన గౌడ సంఘం అధ్యక్షునిగా నాగుల ప్రదీప్ గౌడ్
 ముద్ర,ఎల్లారెడ్డిపేట: గీతా కార్మికుల అభివృద్ధికి కృషి చేస్తానని వారి సమస్యలు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియ చెబుతానని నూతనంగా ఎన్నికైన నాగుల ప్రదీప్ గౌడ్ అన్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన నాగుల ప్రదీప్ గౌడ్ ను గౌడ సంఘం పట్టణ అధ్యక్షునిగా గంట శ్రీనివాస్ గౌడ్ ను ఉపాధ్యక్షులుగా శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.మండల కేంద్రంలోని స్థానిక రేణుక ఎల్లమ్మ దేవాలయం ఆవరణలో ముందుగా రేణుక జమదగ్ని ని దర్శనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా నాగుల ప్రదీప్ గౌడ్ మాట్లాడుతూ తన ఎన్నిక కు సహకరించిన  సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.ఎల్లారెడ్డిపేట గౌడ సంఘం అభివృద్ధి కి తన శాయశక్తులా కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నిక అయిన వారికి పూలమాలలు వేసి సత్కరించారు.ఈ కార్యక్రమం లో గౌడ సంఘం  సభ్యులు పాల్గొన్నారు. త్వరలోనే పూర్తి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుంటామన్నారు.