ఢిల్లీ డెసిషన్ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదనే విషయం తెలుసుకో కెటిఆర్

ఢిల్లీ డెసిషన్ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదనే విషయం తెలుసుకో కెటిఆర్

కాంగ్రెస్ ను విమర్శించే నైతిక హక్కు మీకు లేదు - కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత కేకే మహేందర్ రెడ్డి

ముద్రి ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: గల్లీ లీడర్లు కావాలా,ఢిల్లీకి గులాం గిరి చేసే లీడర్లు కావాలా అని మాట్లాడిన కేటీఆర్ ఆ ఢిల్లీ డెసిషన్ వల్లనే రాష్ట్రం ఏర్పడ్డదనే విషయం తెలుసుకోవాలని మండిపాటు
మీరు చేసిన అవినీతి,అక్రమాల నుండి బయట పడడానికి ఢిల్లీలో ఎవరికి గులాం గిరి చేస్తున్నరో ప్రజలందరికీ తెలుసు
సిరిసిల్లకు గొప్పగొప్ప కాలేజీలను తెచ్చిన అని చెప్పిన మంత్రి కేటీఆర్... సిరిసిల్లలో ఇప్పటికి మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటు
మీ హంగుహర్బటాల కోసం టెట్ అభ్యర్థుల జీవితాలతో ఆడుకున్నారు
నిన్నటి నీ మీటింగ్ కోసం ఎర్రటి ఎండలో విద్యార్థులను,మహిళలను నిల్చోబెట్టినవ్..ఇది ముమ్మాటికీ మానవ హక్కుల ఉల్లంఘనే
నిన్నటి సభలో మంత్రి కేటీఆర్ చేసిన కామెంటలపై పైర్ అయిన కేకే...సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...
కాళేశ్వరం జలాలతో సిరిసిల్ల సస్యశ్యామలం అయితే మా కళ్ళు మందుతున్నయని కేటీఆర్ అనడం హాస్యాస్పదం
సిరిసిల్ల కాళేశ్వరం జలాలు ఎక్కడికి,ఎలా వచ్చినాయో నిరూపించాలి..నిరూపిస్తే దేనికైనా సిద్ధం
కాళేశ్వరం పంపు హౌజ్ లో బాహుబలి మోటార్లు చెడిపోయి పడి నెలలు అవుతున్న బాగు చేయలేని ప్రభుత్వం మీది
9వ ప్యాకేజీని పూర్తి చేయలేదు..అప్పరు మానేరును నింపిన పాపాన పోలేదు
మిడ్ మానేరు నిండినా, ఎల్ఎండి నిండిన..అది  శ్రీపాద , ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ వల్లనే అనే విషయం కేటీఆర్ గమనించాలి
_ప్రజల,రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు తప్ప మీరు ప్రజలకు చేసిందేమి లేదు
ఆర్ఎంపీ, పియేంపి డాక్టర్లకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్స్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది
బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్లను పటించుకొనే పరిస్థితి లేదు
హాస్పిటల్,లైబ్రరీ పక్కనే మీటింగ్ పెట్టీ రోగులను,చదువుకునే విద్యార్థులను శబ్ద కాలుష్యంతో ఇబ్బంది పెట్టారు
గొప్పలు చెప్పుకొని,ప్రతిపక్ష నేతలను తిట్టడానికే మీటింగ్ పెట్టిరూ
నువ్వు చేసే కంత్రి పనులకు, మీ అయ్య చేసిన అవినీతికి, మీ చెల్లే చేసిన లిక్కర్ దందాల నుండి కాపాడుకోడానికి ఢిల్లీలో ఎవరు దోస్తీ చేస్తుర్రో అందరికీ తెలుసు
గల్లిల్లో కొట్టుకుంటూ డిల్లిలో దోస్తీ చేస్తున్న బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు తోడు దొంగలని ప్రజలందరికీ తెలుసు
కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులను విమర్శించే నైతిక హక్కు నీకు, నీ అయ్యకు లేదు
ప్రతిపక్షాలు, ఎన్జీఓలు ఎన్ని విన్నపాలు చేసిన సభను పెట్టీ టెట్ అభ్యర్థులను ఆగం చేశిర్రు
పరీక్ష కేంద్రానికి పక్కనే సభా పెట్టీ టెట్ అభ్యర్థుల జీవితాలతో చెలగాటం అడే పరిస్థితి తెచ్చిర్రు
ఎన్నికల కోడ్ వస్తదని అసంపూర్తిగా ఉన్న కూడ హడావిడిగా మెడికల్ కాలేజీ ఓపెన్ చేసిర్రు 
పరీక్ష విధానపై అవగాహనా లేని వివిధ డిపార్ట్మెంట్ అధికారులకు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు
పక్కనే సభా ఉండడంతో సౌండ్ పోల్యుషన్ వల్ల ఒక పేపర్ కు బదులు మరో పేపర్ ఇచ్చామని అధికారులే చెప్పారు
వాళ్ళు సభ పెట్టుకుంటే మాకేం కడుపునొప్పి కాదు..కానీ ప్రజల సౌలభ్యం కోసం ప్రజా ప్రతినిధులు పనిచేయాలని జ్ఞానం ఉండాలి
టెట్ పరీక్షలో వైట్నర్ పెట్టిన కూడా సవరిస్తమని చెప్పిన అధికారులు.. వైట్నార్ వాడితే పేపర్ ఎలా స్కాన్ అవుతుందో చెప్పాలి.
కేటీఆర్ ఈ విషయం పై స్పందించాలి,స్పష్టమైన హామీ ఇవ్వాలి.
ఈ కార్యక్రమంలో లో కేకే మహేందర్ రెడ్డి గారితో పాటు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్,జిల్లా ఎస్సి సెల్ అధ్యక్షులు ఆకునూరి బాలరాజు,బ్లాక్ అధ్యక్షులు సూర దేవరాజు,తంగాళ్ళపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ జె టోనీ,నాయకులు నాలుక సత్యనారాయణ,కాసర్ల రాజు,మునిగల రాజు,కర్రోళ్ల భాస్కర్,అన్నల్ దాస్ భాను, దేవరాజు తదితరులు.