భూములను గుంజుకుంటున్నారు 

భూములను గుంజుకుంటున్నారు 
  •  కమలం కార్యకర్తలు 10 మంది హస్తం గూటికి 
  •  సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ  ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి

ముద్ర, ఎల్లారెడ్డిపేట:గిరిజనుల భూములను గుంజుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ హయాంలో గిరిజనులకు పూర్తిస్థాయిలో పోడు భూమిని పట్టాలుగా ఇవ్వడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి అన్నారు.ఎల్లారెడ్డిపేట మండలం బుగ్గరాజేశ్వర తండా పరిధిలోని శుక్రవారం జెండా గద్దె ఆవిష్కరణ చేసి అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజన భూమిని ప్రభుత్వం గుంజుకుంటుందని,ప్రభుత్వం ఒకవైపు గిరిజనులకు పట్టాలిస్తున్నామని చెబుతూనే మరోవైపు గిరిజనులు సాగు చేసుకున్న భూమిని లాక్కోవడం జరుగుతుందని ఆరోపించారు.ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో  గిరిజనులకు ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు.మహిళా సంఘాలకు వడ్డీ మాఫీని కూడా కాంగ్రెస్ చేసిందని, అభయ హస్తం  పెన్షన్లను కూడా కాంగ్రెస్ పార్టీ చేసిందన్నారు.రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కూడా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డికి దక్కిందన్నారు. గిరిజనులను అన్యాయంగా ఫారెస్ట్ అధికారులు ఎక్సైజ్ అధికారులు వేధించడం జరుగుతుందని పేర్కొన్నారు. అల్మాస్పూర్ గ్రామానికి చెందిన సిరిసిల్ల సురేష్, సిరిసిల్ల దేవయ్య తో పాటు 10 మంది బిజెపి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కేకే మహేందర్రెడ్డి కండువాలు కప్పి ఆహ్వానం పలికారు.  ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా కార్యదర్శి లింగం గౌడ్ ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి,  నాయకులు గణపతి, మోహన్, చెన్ని బాబు, భూమ్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, లచ్చిరెడ్డి, సోనవేణి రాజయ్య, సత్తయ్య, బాలయ్య, గంట బుచ్చగౌడ్,గండికోటరవి, రాజు నాయక్,  మండల బీసీ సెల్ అధ్యక్షులు అనవేని రవి,మొగుళ్ల మధు  తదితరులు పాల్గొన్నారు.