ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవ వేడుకలో పాల్గొన్న జెడ్పి చైర్ పర్సన్ 

ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవ వేడుకలో పాల్గొన్న జెడ్పి చైర్ పర్సన్ 

సిరిసిల్ల టౌన్, ముద్ర:ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణ ప్రభుత్వం వయోవృద్ధుల సంక్షేమం కోసం చేపట్టిన పథకాల గురించి వివరించారు. వృద్ధుల కోసం ఆసరా పథకం, అలాగే జిల్లాలో ఎల్లారెడ్డిపేట, మండేపల్లిలో ఓల్డ్ ఏజ్ హోమ్స్ నిర్వహణ, వయో వృద్ధులకి ఫిజియోథెరపీ, వివిధ సేవల గురించి వివరించారు. జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య మాట్లాడుతూ వాళ్లు వయసులో మాత్రమే వృద్ధులని అనుభవంలో మరింత జ్ఞానం పొందిన వారని అన్నారు.

సీనియర్ సిటిజన్ ఓటర్లకు అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నరసింహులు ఓటు హక్కు గురించి, ఓటు వేసే విధానం గురించి, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. వయోవృద్ధుల హెల్ప్ లైన్ సేవల గురించి, హెల్ప్ లైన్ 14567 అందిస్తున్న సేవల గురించి, వయోవృద్దుల సంక్షేమ శాఖ చేపట్టిన పలు కార్యక్రమాల గురించి జిల్లా సంక్షేమ అధికారి పి లక్ష్మి రాజం వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ ఫోరం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు చేపూరి బుచ్చయ్య, కార్యదర్శి డా .జనపాల శంకర్, కోశాధికారి వెల్దండి దేవదాసు, డి హబ్ కో ఆర్డినేటర్ రోజా, సిడిపివోలు ఆనందిని, సుచరిత, సఖి కేంద్రం పద్మ, టీఎన్జీవో విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు, ఫీల్ రెస్పాన్స్ ఆఫీసర్ సంతోష్, ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వాహకులు, సిబ్బంది మొదలగు వారు పాల్గొన్నారు.