స్వరం పెంచిన కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి

స్వరం పెంచిన కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి
  • సిరిసిల్ల నియోజకవర్గంలో మళ్లీ యాక్టీవ్..
  • రోజుకో మండలం పర్యటన.. బీఆర్ఎస్ సర్కార్ ను ఎండగడుతున్న కేకే
  • నిత్యం గ్రామాల్లో.. పర్యటనలు.. పరామర్శలు.. శుభకార్యాలకు హజరు
  • కేకే మహేందర్ రెడ్డి వర్గీయులు దిల్కుష్
  • బీఆర్ఎస్ జిల్లా నేతలను విమర్శలతో ముంచెత్తుతున్న కేకే మహేందర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన కేకే మహేందర్ రెడ్డి మళ్లీ యాక్టీవ్ అయ్యారు. మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలో పర్యటనలు తగ్గించిన.. కేకే.. మళ్లీ నాలుగైదు నెలల నుంచి ప్రతి రోజు నియోజకవర్గంలో పర్యటిస్తూ.. ప్రభుత్వ తీరును.. వైఫల్యాలను ఎత్తిచూపుతున్నాడు. గతంలో కేకే మహేందర్ రెడ్డి హైదరాబాద్ కే పరిమితం కావడంతో ఆయన వర్గీయుల్లో నిరాశ ఉండేది. కానీ కేకే మళ్లీ నియోజకవర్గంలో యాక్టీవ్ అయ్యి.. రాజన్నసిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ నేతల తీరును ఎండగడుతుండటంతో.. ఆయన వర్గీయులు దిల్ కుష్ గా ఉన్నారు.

నియోజకవర్గంలో రోజుకో మండలం సందర్శిస్తూ.. ప్రజలను కలుస్తూ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాడు. పరామర్శలు, శుభాకార్యలకు హజరవుతూ.. ఆర్థిక సాయాలు అందిస్తున్నారు. తెల్లవారు జామున పల్లెల్లో సందర్శిస్తూ..ఛాయ్ హోటల్ల వద్ద ఉన్న గ్రామస్తులను అప్యాయంగా పలకరిస్తూ.. ఛాయ్ పే చర్చ జరుపుతున్నాడు. బీఆర్ఎస్ ఎలా దోపిడి చేస్తుందో తెలుసా అంటూ.. అక్కడే వివరిస్తున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా లో పలువురు బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న అక్రమాలను.. దందాలను త్వరలోనే బయటపెడుతానంటూ .. ప్రకటించారు. మంత్రి కేటీఆర్ అనుచరులు సిరిసిల్ల నియోజకవర్గంలో పలు అక్రమాలు చేస్తున్నడంటూ సోషల్ మీడియాలో కేకే మహేందర్ రెడ్డి అనుచరులు ప్రచారం చేస్తున్నారు. కేకే మహేందర్ రెడ్డి మంత్రి కేటీఆర్ ను విమర్శించడంతో.. కేకే మహేందర్ రెడ్డికి వ్యతిరేఖంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడంతో మరుసటి రోజే కాంగ్రెస్ నాయకులు మండలాల వారిగా ప్రెస్మీట్లు పెట్టి తోట ఆగయ్యను విమర్శించారు.

బీఆర్ఎస్ లోకి వచ్చి కోట్లు సంపాదించారంటూ ఆరోపణలు చేశారు. కేకే మహేందర్ రెడ్డిని  బీఆర్ఎస్ నేతలు ఎవరు విమర్శించిన.. కేకే అనుచర వర్గం వ్యక్తిగత ఆస్తులు.. వ్యాపారాలపై విమర్శలు చేయడం కాస్తా విమర్శలకు తావిచ్చిన.. రాజకీయంగా మాత్రం వారిని ఆత్మరక్షణలో పడేస్తున్నరన్న మాట వినవస్తుంది. ఏది ఏమైన సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇన్చార్జీ కేకే మహేందర్ రెడ్డి మళ్లీ రాజకీయంగా యాక్టీవ్ కావడం..విస్తృత పర్యటనలు చేయడం తో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నెలకొంది.