ప్రభుత్వ వైద్యశాలను ఆకస్మిక తనిఖీ 

ప్రభుత్వ వైద్యశాలను ఆకస్మిక తనిఖీ 
  • కాయకల్ప అవార్డు పట్ల హర్షం వ్యక్తం 
  • డిసిహెచ్ఎస్ డాక్టర్ మురళీధర్ రావు

ముద్ర, ఎల్లారెడ్డిపేట : ప్రభుత్వ వైద్యశాలను డిసిహెచ్ఎస్  డా. మురళీధర్ రావు శనివారం ఆకస్మికంగా  తనిఖీ చేశారు. ఎల్లారెడ్డి పెట మెడికల్ సూపరింటెండెంట్ డా బాబు తెలిపిన వివరాల ప్రకారం సామాజిక ఆరోగ్య కేంద్రం యొక్క పరిసరాల పరిశుభ్రత, మొక్కల పరిరక్షణ, ఆసుపత్రి శుభ్రత చూడటం జరిగిందని అన్నారు. అదేవిధంగా ఓ.పి, ఐపి, గర్భిణీ సేవలు, ఆరోగ్య శ్రీ సేవలు, ఫిజియోథెరపీ సేవలు, డైట్ మొదలగు వాటి పై పూర్తి స్థాయిలో వివరములు అడిగి తెలుసుకున్నారని పేర్కొన్నారు. ల్యాబ్, ప్రసూతి రూం, ఓ.పి రూం, ఐపి వార్డ్ లను పరిశీలించారు.ఉద్యోగుల హాజరు, శుభ్రత, సానిటేషన్, సిబ్బంది యొక్క జీతముల వివరాల పై ఆరా తీశారన్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రం లో గొల్లపల్లి గ్రామానికి చెందిన గర్భిణీ  సాధారణ కాన్పు అవడం తో ఆమెకు కెసిఆర్ కిట్ అందజేశారు. తను స్వయంగా పిల్లల వైద్య నిపుణులు కాబట్టి పుట్టిన బిడ్డకు తగు జాగ్రతలు ఎలా తీసుకోవాలో కాన్పు అయిన తల్లికి వివరించారన్నారు .

అదేవిధంగా సామాజిక ఆరోగ్య కేంద్రం లో జనరల్ ఫిజిసియన్ ఉన్నందున  ఉమ్మడి  మండల ప్రజలు తగు వైద్య సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. అదేవిధంగా వైద్యశాలలో నిర్మాణంలో ఉన్న తాత్కాలిక  వంటగది , ఫార్మసీ ఎక్స్టెన్షన్,బాత్ రూం  నిర్మాణం గురించి  స్థానిక తహశీల్దార్ తో  ఫోన్ లో  మాట్లాడటం జరిగిందన్నారు. ఇటీవల సామాజిక ఆరోగ్య కేంద్రానికి కాయకల్ప అవార్డ్ రావడం సంతోషకరం అని కొనియాడారన్నారు.  అదేవిధంగా వచ్చే ఏడాదికి మొదటి స్థానం లో ఉండాలని సూచించారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డ్యూటీ డాక్టర్లు రఘు, ప్రదీప్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా. స్రవంతి, సీనియర్ అసిస్టెంట్ హరీష్, ఫార్మసిస్ట్ వెంకన్న, కంప్యూటర్ ఆపరేటర్ అరవింద్,  స్టాఫ్ నర్స్ లు, ఆరోగ్య మిత్ర, వైద్య సిబ్బంది, శానిటేషన్ సూపర్వైజర్ సతీష్, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.