ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బిజెపి ధర్నా

ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బిజెపి ధర్నా
  • దళితులకు మూడెకరాల భూమి, దళిత బంధు అమలు చేయాలి 
  • నిరుపేదలకు డబుల్ బెడ్ రూములు ఇవ్వాలి
  • మండల బిజెపి నాయకుల డిమాండ్

ముద్ర,ఎల్లారెడ్డిపేట: ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని దళితులకు మూడెకరాల భూమిని పంపిణీ చేయాలని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బిజెపి నాయకులు ధర్నా చేసి స్థానిక తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన సంఘటన  ఎల్లారెడ్డిపేట లో చోటుచేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో  గురువారం ఎల్లారెడ్డిపేట మండల బిజెపి అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో  నాయకులు, కార్యకర్తలు మూకుమ్మడిగా  సిరిసిల్ల, కామారెడ్డి ప్రధాన రహదారి పైన   ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి పాల్గొని  ప్రభుత్వానికి వ్యతిరేకంగా కెసిఆర్ డౌన్ డౌన్, కేటీఆర్ డౌన్ డౌన్,  బిజెపి జిందాబాద్ అంటూ  నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ప్రజలందరికీ కొత్త రేషన్ కార్డులు అందజేయాలని గిరిజన బందును తొందరగా  అమలు చేసి గిరిజనుల అభివృద్ధికి దోహదపడాలన్నారు.

రైతులకు ఉచిత ఎరువుల హామీని తక్షణమే అమలు చేసి రైతన్న ఆదుకోవాలన్నారు.పోడు భూములు పరిష్కరించి వెంటనే పట్టాలు ఇవ్వాలని సూచించారు. బీసీ కులాలలో అన్ని వర్గాలకు  బీసీ బందును అమలు చేసి  వాళ్ల ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలన్నారు.అర్హులైన నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇప్పటివరకు అమలు కాలేదని  వెంటనే నిరుద్యోగ భృతి అందజేయాలన్నారు. ఎల్లారెడ్డిపేట సీఐ శశిధర్ రెడ్డి రంగ ప్రవేశం చేసి బిజెపి నాయకులు చేస్తున్న ధర్నాను విరమింప చేసే ప్రయత్నం చేయగా అక్కడినుండి వెంటనే తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు.  అనంతరం అసిస్టెంట్ తహసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు.  ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.