ఎయిర్ టెల్​ కొత్త ఆఫర్లు 

ఎయిర్ టెల్​ కొత్త ఆఫర్లు 
  • ఇంటర్నెట్ వినియోగదారుల 
  • కోసం తాజా స్కీమ్ లు 

బెంగళూరు :  దేశంలోని టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్.. జియోను వెనక్కు నెట్టేందుకు కొత్త ప్లాన్స్ వేస్తూ వేస్తోంది. ముందుగా యూజర్లు చేజారకుండా చూసుకోవటం ఒకటైతే.. రెండోది వారి నుంచి వస్తున్న ఆదాయాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో దేశంలో పెరుగుతున్న ఇంటర్నెట్ వినియోగదారుల దృష్టిని ఆకర్షించేందుకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. మధ్యతరగతి డేటా వినియోగదారులను టార్గెట్ చేస్తూ రూ.99 డేటా ప్యాక్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ప్రత్యేకత ఏమిటంటే యూజర్లకు ఒక్క రోజుకు అపరిమిత ఇంటర్నెట్ సేవలను అందిస్తుంది. ముఖ్యంగా స్ట్రీమింగ్, క్రికెట్, యూట్యూబ్, గేమింగ్ వంటి అధిక డేటా వినియోగదారులకు ఇది మంచి ఆఫర్ అని చెప్పుకోవచ్చు. ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ వినియోగదారులకు అపరిమిత డేటా ప్లాన్ కేవలం రూ.99కే అందించటం ఇతర టెలికాం ఆపరేటర్లను ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో దిగ్గజ ప్లేయర్ రిలయన్స్ జియోతో పాటు  బీఎస్​ఎన్​ఎల్​ , వొడాఫోన్ ఐడియాలు ఆందోళన చెందుతున్నారు. 

సాధారణంగా రోజువారీ ప్యాక్ ప్రకారం ఇంటర్నెల్ లిమిట్ వినియోగించేసిన తర్వాత స్పీడ్ తగ్గించబడుతుంది. ఇలాంటి సమయంలోనే యూజర్లు కూడా సరిగ్గా ఇలాంటి డేటా ప్లాన్​ల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అన్​లిమిటెడ్​హై-స్పీడ్ డేటా ప్యాక్స్ వారి అవసరాలను తీర్చటంలో సహాయపడతాయి. ఈ ప్లాన్ బేస్ ప్యాక్ కలిగి ఉన్న వినియోగదారులు మాత్రమే వినియోగించుకోగలరు. అలాగే ఎయిర్ టెల్ 5జీ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోని వినియోగదారులు అపరిమిత 5జీ నెట్ పొందవచ్చని కంపెనీ స్పష్టం చేసింది. అయితే 5జీ కనెక్టివిటీ లేని ప్రాంతాల్లోని ప్రజలకు అన్ లిమిటెడ్ 99 ఇంటర్నెట్ ప్యాక్ బాగా ఉపయోగకరంగా ఉంటుందని తెలుస్తోంది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఎఫ్​యూపీ నిబంధనల ప్రకారం అన్​లిమిటెడ్ ప్రీపెయిడ్​​ప్యాక్​గరిష్ఠ డేటా పరిమితి 30జీబీ మాత్రమే. ఒక వేళ యూజర్​30 జీబీ మొత్తాన్ని వినియోగించుకుంటే.. తరువాత 64 కేబీపీఎస్​వేగంతో ఇంటర్నెట్ పొందటం కొనసాగించొచ్చు.