ఎంఎస్​ఎంఇ’ లకు రూ. 2 లక్షల కోట్ల రుణం

ఎంఎస్​ఎంఇ’ లకు రూ. 2 లక్షల కోట్ల రుణం
2 lakh crore loan For MSMEs

ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 ప్రారంభించబడుతోంది. ‘ఎంఎస్​ఎంఇ’లకు రూ. 2 లక్షల కోట్ల రుణం ఇవ్వడానికి ప్రణాళిక ఉందన్నారు. సూక్ష్మ, లఘు, చిన్న తరహా పరిశ్రమల ప్రోత్సాహం కోసం కేంద్రం కట్టుబడి ఉందని, ఈ పరిశ్రమలన్నీ కరోనా సమయంలో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయని ఈ రంగానికి మరింత ఊతమిచ్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. క్రెడిట్ గ్యారెంటీ ఎంఎస్‌ఎంఈలకు పునరుద్ధరణ పథకం వస్తుందని, దీని ద్వారా పరిశ్రమలకు 9000 కోట్లు క్రెడిట్‌గా ఇవ్వబడుతుంది.

యువతకు పెద్దపీట.. 30 స్కిల్​ ఇండియా కేంద్రాలు.. 47 లక్షల మందికి స్టైఫండ్..
యువత కోసం స్కిల్ యూత్ సెంటర్ల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని, విదేశాల్లో ఉద్యోగాలు సాధించాలని కలలు కనే విద్యార్థుల కోసం 30 స్కిల్ ఇండియా కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. నేషనల్ అప్రెంటీస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ ఏర్పాటు చేసి విద్యార్థులకు నేరుగా సహాయం అందించబడుతుంది. ఫిన్‌టెక్ సేవలు పెంచబడతాయి, డిజి లాకర్ యూటిలిటీ చాలా పెరుగుతుంది,  ఇది అన్ని డిజిటల్ పత్రాలను కలిగి ఉంటుంది. 47 లక్షల మంది యువతకు స్టైఫండ్ ఇస్తామని, ఇందుకోసం నేషనల్ అప్రెంటిస్‌షిప్ పథకాన్ని ప్రారంభిస్తామని ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో చెప్పారు. ఎవరూ ఆకలితో బాధపడకుండా చూశాం. ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ కొనసాగుతోంది. వంద కోట్లమందికి 220 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు అందించాం. భారత ఆర్థిక వ్యవస్థ సరైన దారిలో పయనిస్తోంది.