ఐపీఎస్‌పై లైంగిక వేధింపులు.. 

ఐపీఎస్‌పై లైంగిక వేధింపులు.. 
  • మాజీ డీపీజీకి మూడేళ్ల జైలు

తమిళనాడు: తమిళనాడు మాజీ స్పెషల్ డీజీపీ లైంగిక వేధింపుల కేసులో విల్లుపురం కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. మాజీ డీజీపీ రాజేశ్ దాస్‌ను న్యాయస్థానం దోషిగా నిర్దారించింది. ఆయనకు మూడేళ్ల కఠిన జైలు శిక్షను విధిస్తూ విల్లుపురం కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. అతడిపై మహిళా ఐపీఎస్ అధికారిణి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదయ్యింది. ఆమె మాజీ డీజీపీ‌పై చేసిన ఫిర్యాదులో తనకు ఎదురైన ఇబ్బందులను తెలియజేశారు. రాజేశ్ దాస్ తన చేతిని ముద్దాడుతూ,అతని మొబైల్ ఫోనులో నా ఫొటోలు చూపిస్తూ, నా ఫేవరెట్ లిస్ట్ అని చెప్పారని ఆమె ఫిర్యాదులో బాధితురాలు ఆరోపించారు.మహిళా పోలీస్ అధికారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన తమిళనాడు మాజీ స్పెషనల్  ఫిబ్రవరి 2021లో మహిళా ఐపీఎస్ అధికారిణి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయనపై కేసు నమోదుచేశారు. అప్పటి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి పర్యటన సందర్భంగా భద్రత విధులకు వెళ్లి సమయంలో తనపై రాజేశ్ దాస్ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆమె ఆరోపించారు.

ఆమె మాజీ డీజీపీ‌పై చేసిన ఫిర్యాదులో తనకు ఎదురైన ఇబ్బందులను తెలియజేశారు. రాజేశ్ దాస్ తన చేతిని ముద్దాడుతూ, అతడి మొబైల్ ఫోనులో నా ఫొటోలు చూపిస్తూ నా ఫేవరెట్ లిస్ట్ అని చెప్పారని ఆమె వాపోయారు. స్పెషల్ డీజీపీ అతని కారులో కూర్చుని తదుపరి మీటింగ్‌కు రావాలని కోరారు.. అలాగే పెరంబూర్ వరకూ డ్రాప్ చేస్తానన్నారు. సీఎం కార్యక్రమం ముగిసిన అనంతరం తామిద్దరం ఒకే కారులో సాయంత్రం 6:30కి బయలుదేరాం.. ఈ క్రమంలో ఆయన కారును రెండు ప్రాంతాల్లో ఆపారు... అక్కడే తన మొబైల్‌లో నా ఫోటోలు చూపించి, ఫేవరెట్ లిస్ట్ ఇదని అన్నారు.దీంతో నాటి అన్నాడీఎంకే ప్రభుత్వం దాస్‌ను సస్పెండ్ చేసింది. దీనిపై విచారణకు ఆరుగురు సభ్యుల కమిటీని నియమించింది. విచారణ చేపట్టిన ఈ కమిటీ.. పోలీసులు సహా 68 మంది సాక్షుల వాంగ్మూలాలను రికార్డు చేసింది. నివేదికను కోర్టుకు సమర్పించడంతో మాజీ డీజీపీని దోషిగా నిర్దారించింది. అయితే, తనకు తక్షణమే బెయిల్ మంజూరు చేయాలని ఆయన కోరే అవకాశం ఉందని ప్రాసిక్యూషన్ సభ్యుడు ఒకరు అన్నారు.