దుమారం రేపుతున్న విదేశాంగమంత్రి జై శంకర్ వ్యాఖ్యలు

దుమారం రేపుతున్న విదేశాంగమంత్రి జై శంకర్ వ్యాఖ్యలు

చైనా.. భారత్ కన్నా పెద్ద ఆర్ధిక వ్యవస్థ కలిగిన దేశమని, ఇటువంటి పరిస్థితుల్లో మనం చైనాతో యుద్ధం చేయలేమని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్ జయశంకర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. 
గత ఏడాది కాలంలో రష్యా నుంచి చవకగా చమురును దిగుమతి చేసుకోవడంలో, పాకిస్తాన్‌ సమస్య పరిష్కారంలో, లడఖ్‌లో చైనా వైఖరి తదితర విషయాల్లో విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ వ్యవహరించిన విదేశాంగ విధానం, దౌత్యం అద్భుతంగా ఉందంటూ గతంలో కితాబు అందుకున్నారు.  అయితే ఆయన తాజాగా చైనాపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీనిపై స్పందించిన మాజీ విదేశాంగ కార్యదర్శి శశాంక్.. పలు విషయాలలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో ఏకీభవించినప్పటికీ, భారతదేశం. చైనా సరిహద్దులో ఉన్న వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వెంబడి చారిత్రాత్మకంగా సైన్యాన్ని మోహరించడం గురించి ప్రశ్నించారు. విజయవంతమైన విదేశాంగ విధానం, దౌత్యం మొదలైనవి సరిహద్దుల్లో సైనికుల మోహరింపును తగ్గిస్తాయని శశాంక్ వ్యాఖ్యానించారు. ఇది శాంతి స్థాపనకు బాటలు వేస్తుందన్నారు.