దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్​ కేసులు

దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్​ కేసులు

దేశంలో క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డుతున్న వారి సంఖ్య  క్రమంగా  పెరుగుతోంది. భారతదేశంలో 1,500 ల‌కు పైగా కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇది 146 రోజులలో అత్యధికమ‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ‌ గణాంకాలు చెబుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,590 కోవిడ్ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. ఇదే స‌మ‌యంలో కొత్తగా  910 మంది కోలుకున్నారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 8,601కి పెరిగింది.  కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివ‌రాల ప్రకారం.. గ‌త 24 గంట‌ల్లో కొత్తగా మహారాష్ట్రలో ముగ్గురు, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరాఖండ్ ల‌లో ఒక్కొక్కరు చొప్పున క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డి మ‌ర‌ణించారు. దీంతో దేశంలో మొత్తం కోవిడ్-19 మ‌ర‌ణాల సంఖ్య 5,30,824 కు పెరిగింది. ఇదే సమయంలో రోజువారీ పాజిటివిటీ 1.33 శాతం, వీక్లీ పాజిటివిటీ 1.23 శాతంగా నమోదైంది. దేశంలో మొత్తం కోవిడ్ కేసుల‌ సంఖ్య 4,47,02,257 కు పెరిగింది.  మొత్తం కేసులలో క్రియాశీల కేసులు 0.02 శాతం ఉన్నాయి. జాతీయ కోవిడ్ రికవరీ రేటు 98.79 శాతంగా నమోదైంది. కోవిడ్-19 రికవరీలు 4,41,62,832 కు పెరిగాయి. మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. ఇప్పటివరకు 220.65 కోట్ల డోసుల కోవిడ్-19 వ్యాక్సిన్లు వేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.