జీ20 నేతలకు అంగవస్త్రం బహూకరించిన  నరేంద్ర మోడీ

జీ20 నేతలకు అంగవస్త్రం బహూకరించిన  నరేంద్ర మోడీ

ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సుకు హాజరైన దేశాధినేతలకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘అంగవస్త్రం’తో స్వాగతం పలికారు. ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఖాదీ వస్త్రానికి, ప్రధాని ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి సంబంధం ఉండడం విశేషం. దీనిని ఉత్తరప్రదేశ్‌లో జలేశ్వర్ ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో తయారుచేశారు. ‘జ్యోతి గ్రీన్’ ఫ్యాక్టరీలో తయారుచేసిన ఈ అంగవస్త్రాన్ని ప్రధాని నరేంద్ర మోడీ జీ20 నేతలకు బహూకరించారు. జ్యోతి గ్రీన్ కంపెనీని అంకిత్ సిసోడియా స్థాపించారు. ప్రధాని మన్ కీ బాత్ స్ఫూర్తితో ఆయనీ ఫ్యాక్టరీని స్థాపించారు. ఎంబీఏ చేసిన సిసోడియా  తొలుత ఏడాదిపాటు ఓ బహుళజాతి కంపెనీలో పనిచేశారు. ప్రధాని మన్ కీ బాత్ విన్న తర్వాత సొంతంగా వ్యాపారం చేసుకోవాలని నిర్ణయించుకుని ఈ ఫ్యాక్టరీని స్థాపించారు. సంప్రదాయ పద్ధతిలో కాకుండా ఆధునిక పద్ధతిలో ఖాదీ వస్త్రాలను తయారు చేయాలన్న లక్ష్యంతో ఐదేళ్ల క్రితం ఆయన ఫ్యాక్టరీ ప్రారంభించారు. జలేశ్వర్‌లో ఉన్న ఈ ఫ్యాక్టరీ దేశంలోనే తొలి సోలార్ ఖాదీ యూనిట్.