Adani Hindenburg Controversy: అదానీ - హిండెన్‌బర్గ్ వివాదం: నిపుణుల కమిటీ ఏర్పాటు 

Adani Hindenburg Controversy: అదానీ - హిండెన్‌బర్గ్ వివాదం: నిపుణుల కమిటీ ఏర్పాటు 
Adani Hindenburg Controversy

హిండెన్‌ బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ షేర్ల పతనం వ్యవహారం, మోసం ఆరోపణలను పరిశీలించడానికి ఆరుగురు సభ్యుల నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది.

సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఏఎం సప్రే ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. కమిటీలో సభ్యులుగా ఓపీ భట్, కేవీ కామత్, జస్టిస్ కేపీ దేవదత్, నందన్ నీలేకని, సోమశేఖర్ సుందరేశన్ ఉండనున్నారు. ఈ నిపుణుల కమిటీకి సెబీ, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు మద్దతు ఇవ్వాలని సుప్రీం కోర్టు పేర్కొంది. కమిటీ పరిస్థితిని మొత్తంగా అంచనా వేస్తుందని, పెట్టుబడిదారులకు అవగాహన కల్పించే చర్యలను సూచిస్తుందని తెలిపింది.