వెయ్యి పెనాల్టీతో

వెయ్యి పెనాల్టీతో
  • ఆధార్​– పాన్​లింక్​
  • మరో మూడు నెలలు పెంపు
  • సెప్టెంబర్​ 14 లింక్​కు చివరి తేదీ
  • ఆ తరువాత లింక్​ చేసుకుంటే రూ. 10వేలు సమర్పించుకోవాల్సిందే
  • లింక్​ లేకుంటే ఆర్థిక ప్రయోజనాలకు మంగళం పాడుకున్నట్లే!

న్యూఢిల్లీ:  పాన్‌, ఆధార్‌ను లింక్ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం జూన్ 30 వరకు గడువిచ్చిన ప్రభుత్వం గురువారం ఆ గడువును మరో మూడు నెలలు పెంచింది. సెప్టెంబర్ 14వ తేదీ వరకు ఆధార్ కార్డ్ అప్‌డేట్ కోసం గడువు పెంచారు. 

మరోవైపు ఇక ఈ గడువును పెంచేది లేదని కేంద్రం ఇదివరకే పలుమార్లు స్పష్టం చేసినా చివరిసారిగా మరోసారి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. అంతకుముందు పలుమార్లు ఆధార్​–పాన్​లింక్​ల గడువును పొడిగించింది కూడా. ఒకవేళ జూన్​ 30లోపు లింక్​ చేసుకోకుంటే పాక్​కార్డు క్యాన్సల్​ అవుతాయని వెల్లడించింది. ఇప్పుడు తాజాగా ఆ గడువు సెప్టెంబర్​ 14కు పెరిగింది. అప్పటికీ లింక్​ చేసుకోకుంటే ఆర్థిక లావాదేవీల నిర్వహణలో పలు ఇబ్బందులు తలెత్తే ఆస్కారం ఉంది. మరోవైపు జూన్​ 30వ తేదీ తరువాత అంటే జూలై 1వ తేదీ నుంచి గనుక పాన్​ఆధార్​ లింక్​ చేసుకుంటే రూ. 10వేలు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఇంతకుముందు ప్రకటించింది. అయితే తాజా ప్రకటనతో సెప్టెంబర్​ 14 తరువాత రూ. 10వేల ఫైన్​తో లింక్​ ప్రక్రియ పూర్తి చేసుకునే అవకాశం ఉంది. 
పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ బ్యాంక్ ఖాతా తెరవడం, ఐటీఆర్ దాఖలు చేయడం, ఆస్తి కొనుగోలు మొదలైన వాటి నుంచి పాన్ కార్డ్ అవసరం. లింకింగ్​ సౌకర్యాన్ని ఉచితంగా మార్చి 31వరకూ కేంద్రం ప్రకటించింది. అనంతరం ఆధార్​ పాన్​ లింకింగ్​ చేసుకుంటే రూ. 1000 చెల్లించాల్సి వస్తోంది. పన్ను చెల్లింపుదారుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. పాన్ ఆధార్ అనుసంధానానికి గడువును జూన్ 30 వరకు పొడిగించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్చి 28 న పత్రికా ప్రకటన ద్వారా ఈ విషయాన్ని తెలిపింది. జూన్​ 15న మరోమూడు నెలలు పొడిగించినట్లు ప్రకటించింది.
పాన్​ ఆధార్​ లింక్​ లేని పక్షంలో స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు, పన్ను ప్రయోజనాలు, క్రెడిట్‌ల వంటి ప్రయోజనాలను సదరు కార్డు హోల్డర్లు పొందలేరు. ఏ బ్యాంకు నుంచి రుణాన్ని కూడా పొందలేరు.

 
పాన్ ఆధార్‌ని ఎలా లింక్ చేయాలి..

మీరు పాన్, ఆధార్ లింక్ చేయాలనుకుంటే, దీని కోసం ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్  ని సందర్శించండి .
మీరు లాగిన్ వివరాలను పూరించండి.
తర్వాత క్విక్ సెక్షన్‌లోకి వెళ్లి అక్కడ మీ పాన్, ఆధార్ నంబర్, మొబైల్‌ను నమోదు చేయండి.
దీని తర్వాత నేను నా ఆధార్ వివరాలను చెల్లుబాటు చేస్తున్నాను అనే ఎంపికపై టిక్ చేయండి.
తర్వాత, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటిపి వస్తుంది, దాన్ని ఇక్కడ నమోదు చేయండి.
చివరగా, రూ. 1,000 జరిమానా చెల్లించడం ద్వారా పాన్, ఆధార్‌ను లింక్ చేయండి.