గుండెపోటుతో రోడ్డుపై కుప్పకూలిన యువకుడిని కాపాడిన కానిస్టేబుల్

గుండెపోటుతో రోడ్డుపై కుప్పకూలిన యువకుడిని కాపాడిన కానిస్టేబుల్

వరంగల్ జిల్లా రేగొండ మండల పరిధిలో వంశీ అనే యువకుడు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో తీవ్ర ఆందోళనకు గురయిన అతడు గుండెపోటుకు గురై రోడ్డుపై పడిపోయాడు. ఇది గమనించిన కానిస్టేబుల్ అపస్మారక స్థితిలో పడివున్న వంశీకి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. వెంటనే పోలీస్ వాహనంలో అతడిని దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించడంతో ప్రాణాలు దక్కాయి. యువకుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ ను పోలీస్ ఉన్నతాధికారులతో పాటు ప్రజలు కూడా అభినందిస్తున్నారు.