సీనియర్ సిటిజన్లకు వరం

సీనియర్ సిటిజన్లకు వరం
  • 8 బ్యాంకుల్లో ఎక్కువ వడ్డీ ..  9.60 శాతం వరకు రిటర్న్‌లు

ముంబై :  సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్‌లకు పెట్టుబడిపై మంచి రాబడిని ఇవ్వడానికి ఉంది. ఇప్పుడు చాలా బ్యాంకులు ఈ పథకం కంటే ఎక్కువ వడ్డీని ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై ఇస్తున్నాయి. ఈ బ్యాంకుల్లో ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, యెస్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, జన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వంటివి ఉన్నాయి. బంధన్ బ్యాంక్: ఈ బ్యాంక్ 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లకు 8.35 శాతం వడ్డీని ఇస్తోంది.  ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: ఈ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 8.75 శాతం వడ్డీని ఇస్తోంది.  ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: సీనియర్ సిటిజన్లకు ఈ బ్యాంకులో  ఎఫ్​డీపై 8.6 శాతం వరకు వడ్డీ లభిస్తోంది.  జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: ఈ 60 ఏళ్లు పైబడిన వారికి 9 శాతం వడ్డీని అందిస్తోంది.  ఈఏఎస్ఎఫ్​ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: ఈ బ్యాంకులో కూడా డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా, సీనియర్ సిటిజన్లు 9 శాతం వడ్డీని పొందుతారు. యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: సీనియర్ సిటిజన్లు వారి  ఫిక్స్ డ్​పై 9.5 శాతం వడ్డీని ఈ బ్యాంకులో పొందుతారు.  సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: ఈ బ్యాంకు సీనియర్ సిటిజన్లకు అన్ని బ్యాంకుల కంటే అత్యధిక వడ్డీని అందిస్తోంది. 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు ఇక్కడ గరిష్టంగా 9.60 శాతం వడ్డీని పొందవచ్చు