స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్​లు 

స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్​లు 

ముంబై : నాలుగు రోజుల వరుస నష్టాలకు తెరపడింది. భారత స్టాక్‌ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడంతో సూచీలు ఫ్లాట్‌గా మొదలయ్యాయి. ఆఖర్లో సెంటిమెంటు బలపడటంతో లాభాల బాట పట్టాయి.  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ  అర పాయింటు పెరిగి 19,674  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 14 పాయింట్లు ఎగిసి 66,023 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 21 పైసలు బలహీనపడి 83.15 వద్ద స్థిరపడింది. ఐటీ షేర్లు మాత్రం ఎరుపెక్కాయి. బీఎస్ఈ సెన్సెక్స్  , క్రితం సెషన్లో 66,009 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 66,082 వద్ద మొదలైంది. 65,764 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,225 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 14 పాయింట్లు పెరిగి 66,023 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిప్టీ ,  శుక్రవారం 19,674 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 19,678 వద్ద ఓపెనైంది. 19,601 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,734 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. అర పాయింటు పెరిగి 19,674 వద్ద క్లోజైంది. నిఫ్టీ 50లో 24 కంపెనీలు లాభాల్లో 25 నష్టాల్లో ఉన్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టాటా కన్జూమర్‌, అపోలో హాస్పిటల్స్‌, కోల్‌ ఇండియా షేర్లు లాభపడ్డాయి. హిందాల్కో, ఎస్బీఐ లైఫ్‌, ఇన్ఫీ, హీరోమోటో, ఎం అండ్‌ ఎం షేర్లు నష్టపోయాయి. ఐటీ, మీడియా, ఫార్మా, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు నష్టపోయాయి. ఫైనాన్స్‌, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు ఎగిశాయి.