3600కిలోల టమాటాల పట్టివేత

3600కిలోల టమాటాల పట్టివేత
  • డ్రైవర్లను విచారణ చేస్తున్న అధికారులు
  • తరలింపుపై అనుమానాల నివృత్తి కోసం నాణ్యతా పరీక్షలు

యూపీ: ఇండో–నేపాల్​సరిహద్దులో అక్రమంగా తరలిస్తున్న 3వేల కిలోల టమాటాలను పోలీసులు పట్టుకున్నారు. ఈ టమాటాలను రెండు గూడ్స్​వాహనాల్లో తీసుకువెళుతుండగా భద్రత సిబ్బంది తనిఖీల్లో ఇది అక్రమ తరలింపు అని తేలింది. దీంతో ఇరువురు వాహన డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న టమాటాల విలువ రూ.1.83 లక్షలని పోలీసులు తెలిపారు. గత కొన్ని రోజులుగా భారత్‌లో టమాటా ధరలు ఆకాశాన్నంటుతుండడంతో అక్రమ తరలింపు, చోరీలు పెరిగిపోయాయి. ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌కు ఆనుకుని ఉన్న నేపాల్ సరిహద్దు గోరఖ్‌పూర్ మార్గంలో 3,060 కిలోల టమాటాలు ఉన్న రెండు పికప్ ట్రక్కులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

టమాటాలను ఎక్కడికి తీసుకువెళుతున్నారనే విషయంపై పొంతనలేని సమాధానాలు చెబుతుండడం, వాటికి సంబంధించిన సరైన ఆధారాలు కూడా చూపకపోవడంతో పోలీసులు డ్రైవర్లను అరెస్టు చేసి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ టమాటాల ధరలు నేపాల్​లో తక్కువగా ఉన్నాయని అక్కడికి తరలించే అవసరం వీరికి లేదని ఎందుకు తరలిస్తున్నారనే విషయంపై ఆరా తీస్తున్నామని అలాగే వీటి నాణ్యతపై కూడా పలు సందేహాలు ఉన్నందున నాణ్యత తనిఖీకి పంపామని కస్టమ్స్ అధికారి ఆర్తీ సక్సేనా మీడియాకు వివరించారు.