థాంక్ యూ ప్రైమ్ మినిస్టర్... ఫ్రాన్స్ అధ్యక్షుడు సెల్ఫీ వీడియో పోస్ట్

థాంక్ యూ ప్రైమ్ మినిస్టర్... ఫ్రాన్స్ అధ్యక్షుడు సెల్ఫీ వీడియో పోస్ట్

భారత ప్రధాని పర్యటనను గుర్తు చేసుకుంటూ French President Emmanuel Macron ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ తన ట్విట్టర్ అకౌంట్లో ఒక సెల్ఫీ వీడియోని పోస్ట్ చేశారు. అందులో ప్రధాని నరేంద్ర మోడీతో గడిపిన క్షణాలను పొందుపరచి ఇది భారతీయ ప్రజలకు, వారి నమ్మకానికి, స్నేహానికి అని రాశారు.  భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ బాస్టిల్ డే ఉత్సవాలకు అతిధిగా హాజరైన సంగతి తెలిసిందే. రెండ్రోజుల పాటు అజరిగిన ప్రధాని పర్యటనలో అపురూప క్షణాలన్నిటినీ వీడియోగా మలచి ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇదే వీడియోని Prime Minister modi retweete ప్రధాని మళ్ళీ రీట్వీట్ చేస్తూ.. ఫ్రాన్స్- భారత్ మన బంధం కాలాతీతమైనది. ఇందులో మన విలువలు, కలిసికట్టుగా కన్న కలలు ప్రతిధ్వనిస్తుంటాయి. నా ప్రియ స్నేహితుడైన ఇమ్మాన్యుయేల్ మేక్రాన్.. నేను ఈ దఫా ఫ్రాన్స్ లో గడిపిన ప్రతి క్షణాన్నీ నెమరు వేసుకుంటూనే ఉంటానని రాశారు. 

ఫ్రాన్స్ అధ్యక్షుడు పోస్ట్ చేసిన వీడియో భారత ప్రధానికి ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని బహుకరించడడంతో  మొదలైంది. అనంతరం జులై 14న జరిగిన Bastille Day celebrations బాస్టిల్ డే ఉత్సవాల్లో ప్రధానితో కలిసి మెక్రాన్ పాల్గొన దృశ్యాలు.. అందులో సైనిక, వైమానిక దళాల విన్యాసాలను ఇద్దరు కలిసి తిలకిస్తున్న సన్నివేశాలున్నాయి. ఫ్రాన్స్ దేశాధినేతలతో Elsie Palace ఎల్సీ ప్యాలెస్ లో జరిగిన సమావేశం.. అందులోని ఒప్పందాలు.. France Economic Forum ఫ్రాన్స్ ఎకనామిక్ ఫోరమ్ సభ్యులతో మంతనాలు.. Louvre Museum లౌవ్రే మ్యూజియంలో డిన్నర్ అన్నిటినీ దృశ్యాల సమాహారంగా చేసి చివర్లో ప్రధాన మంత్రికి కృతఙ్ఞతలు తెలిపారు. వీడియో చివర్లో భారతీయ నటుడు మాధవన్ కూడా  తళుక్కున మెరిశారు. అందరూ కలిసి సెల్ఫీ తీసుకున్న దృశ్యం వీడియోకే హైలైట్.