భౌతిక, రసాయన శాస్ర్తంలో ముగ్గురికి నోబెల్

భౌతిక, రసాయన శాస్ర్తంలో ముగ్గురికి నోబెల్

న్యూఢిల్లీ: భౌతిక, రసాయన శాస్ర్తంలో విశిష్ట సేవలు అందించినందుకు ముగ్గురికి ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం దక్కింది. పియరీ అగోస్టినీ, ఫెరెన్క్​ క్రౌజ్, అన్నె ఎల్ హుల్లియర్​కు మంగళవారం ఈ పురస్కారానికి ఎంపికైనట్లు ప్రకటించింది. అణువులు, ప్రయాణించే వేగాలు, దిశలు, ఎలక్ట్రాన్లు తదితర వాటిపై పరిశోధనలు చేసి వీరు విజయం సాధించారు. తక్కువ కాంతి రూపొందించి వాటి ద్వారా అణువుల్లో ఎలక్ట్రాన్లు కదిలే శక్తిని కొలవడంలో వారు విజయం సాధించారు. పియరీ అగోస్టినీ (82) ఫ్రెంచ్​కు చెందిన రసాయన శాస్ర్త శాస్ర్తవేత్త. ఫెరెన్క్​ క్రౌజ్​(61)హంగేరికి చెందిన శాస్ర్తవేత్త అణువులపై ఆటోసెకండ్లలో అనే అంశంపై పరిశోధనలు చేసి విజయం సాధించారు. అన్నె ఎల్ హుల్లియర్(65) ఫ్రాన్స్ కు చెందిన వారు. రసాయనశాస్ర్తం ప్రొఫెసర్​గా పనిచేస్తూనే పలు ఆటోమిక్​ అంశాలపై పరిశోధనలు చేసినందుకు గాను వీరి కృషికి నోబెల్​దక్కింది.