హింసాత్మక ఘటనలతో అట్టడుకుతున్న మణిపూర్​

హింసాత్మక ఘటనలతో అట్టడుకుతున్న మణిపూర్​

మణిపూర్​లో మంటలు మండిపోతున్నాయి. గిరిజన సంఘాల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. హింసాత్మక ఘటనలతో అట్టడుకుతున్న మణిపూర్​. అల్లర్లు కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. తీవ్రమైన కేసుల్లో కనిపిస్తే కాల్చివేతకు ఉత్తర్వులు ఇచ్చారు. ఆందోళనకారులను కట్టడి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 55 కంపెనీల ఆర్మీ, అస్సాం రైఫిల్స్​ సిబ్బందిని మోహరించారు. ముందు జాగ్రత్తగా మరో 14 బృందాలను సిద్ధం చేశారు. రాష్ట్రంలోని 8 జిల్లాల్లో ఇప్పటికే కర్ఫ్యూ విధించారు. పలు ప్రాంతాల్లో 144 సెక్షన్​ అమలు చేస్తున్నారు. మెయితీ కమ్యూనిటీని షెడ్యూలు తెగలో చేర్చే చర్యలపై వ్యతిరేకత వస్తోంది.