నూహ్​ వదంతులను నమ్మొద్దు

నూహ్​ వదంతులను నమ్మొద్దు
  • రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తప్పవు
  • నేడు కూడా నిందితుల ఇళ్లు, దుకాణాలపై బుల్డోజర్​
  • పాక్​ హస్తం అవాస్తం
  • అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) మమతా సింగ్

హర్యానా: హర్యానాలోని నుహ్​లో జరిగిన హింసలో ఆదివారం వరకూ 216 మందిని అరెస్ట్​ చేసినట్లు ఆదివారం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) మమతా సింగ్ తెలిపారు. మరోవైపు హింసపై సోషల్​ మీడియా వేదికగా అసత్య కథనాలు, ఫోటోలు ప్రచారం చేస్తుండడంతో వాటిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రజలు ఆయా అసత్యకథనాలను, రెచ్చగొట్టే కథనాలను ప్రసారం చేయవద్దని, వాటిని నమ్మవద్దని, వదంతులను ప్రసారం చేసి కొందరు హింసను ప్రేరేపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వారిని వదిలేది లేదన్నారు. నుహ్​ దేవాలయంలో మహిళలపై అత్యాచారాలు చోటు చేసుకున్నాయనే వదంతులు సోషల్​ మీడియాలోవి తమ దృష్టికి వచ్చాయన్నారు. వీటిని సృష్టించినవారి పట్ల, షేర్​ చేసిన వారి పట్ల చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు రాళ్లదాడిలో, హింసలో పాల్పడ్డ నిందితుల ఇళ్లపై అధికార యంత్రాంగం ఒక్కొక్కరుగా గుర్తిస్తూ వారి ఇళ్లపై బుల్డోజర్​ మార్క్​ట్రీట్​మెంట్​ను ప్రయోగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం కూడా బుల్డోజర్​తో పలు ఇళ్లు, దుకాణాలను నేలమట్టం చేశారు. కాగా అల్లర్లలో పాక్​ హస్తం ఉందనే వీడియోలపై పూర్తి విచారణ చేపట్టామని ఇందులో పాక్​ హస్తం లేదని రుజువైందని తెలిపారు.