అఖండ భారత్​ లక్ష్యం

అఖండ భారత్​ లక్ష్యం
  • అవినీతి, కుటుంబ పాలన పోవాల్సిందే
  • ఆగస్టు 15న ‘హర్​ఘర్​ తిరంగా’
  • కుటీల బుద్ధితోనే అభివృద్ధి పనులకు విపక్షాలు అడ్డు
  • అమృత్​భారత్​స్టేషన్​శంకుస్థాపనలో ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: దేశంలో అవినీతి, కుటుంబ పాలన కనుమరుగు కావాలని, అఖండ భారతే తమ లక్ష్యమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఆగస్టు 15న ప్రతీ ఒక్కరూ ‘హర్​ఘర్​ తిరంగా’ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. విపక్ష పార్టీలు కుటీల బుద్ధితో ఉన్నాయన్నారు. అభివృద్ధి పనులకు అడ్డు తగులుతున్నాయన్నారు. అఖండ భారత్​ను వ్యతిరేకిస్తున్నాయన్నారు. ఒక్కసారి కూడా సర్ధార్​వల్లభ్​బాయ్​ పటేల్​ విగ్రహాన్ని వారు సందర్శించకపోవడం కూడా ఒక నిదర్శనం అన్నారు. 

 కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ పథకం పేరుతో దేశవ్యాప్తంగా ఉన్న రైల్వేస్టేషన్‌లను అభివృద్ధి చేయబోతుంది. ఈ నేపథ్యంలోనే ఆయా రైల్వే స్టేషన్లను స్మార్ట్‌ రైల్వే స్టేషన్లుగా మార్చేందుకు ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదివారం ఉదయం 11 గంటలకు శంకుస్థాపన చేశారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశంలోని 508 రైల్వే స్టేషన్లను అభివృద్ది చేసేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజీపీ ప్రభుత్వం పూనుకుంది. అలాగే మొత్తం 1309 రైల్వే స్టేషన్ల రూపు రేఖలు పూర్తిగా మారనున్నాయి. ఇక ఆయా రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనుల కోసం మోదీ ప్రభుత్వం మొత్తం 24,470 కోట్లకు పైగా ఖర్చు చేయనుంది. రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయడం ద్వారా దేశంలోని పలు నగరాలను కూడా అభివృద్ధి చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయనున్న 508 రైల్వే స్టేషన్లు 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. వీటిలో ఉత్తరప్రదేశ్ 55, రాజస్థాన్‌లలో 55, బీహార్‌లో 49, మహారాష్ట్రలో 44, వెస్ట్ బెంగాల్‌లో 37, మధ్యప్రదేశ్‌లో 34, అస్సాంలో 32, ఒడిశాలో 25, పంజాబ్‌లో 22, గుజరాత్ 21, తెలంగాణలో 21, జార్ఖండ్‌లో 20 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో 18, తమిళనాడులో 18, హర్యానాలో 15 కర్ణాటకలోని 13 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఇక ఆయా స్టేషన్లలో ఆధునీకరణనే దృష్టిలో ఉంచుకుని రూఫ్‌ ప్లాజాను నిర్మించనున్నారు. ఇంకా వెయిటింగ్ ఏరియా, లోకల్ ప్రొడక్ట్స్, ఫుడ్ కోర్ట్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఇతర వస్తువుల కోసం షాపింగ్ వంటివి కూడా ఏర్పాటు కానున్నాయి. 
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఆగస్టు ధన్యవాదాలు తెలపాల్సిన నెల అయి, రేపు(ఆగస్టు 7) దేశం మొత్తం చేనేత దినోత్సవం జరపుకుంటుందని, మరికొన్ని రోజుల్లోనే వినాయక చతుర్థి రానుందని, ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను మాత్రమే కొనుగోలు చేద్దామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆగస్టు 8న క్విట్ ఇండియా దినోత్సవం రానుందని..