ఆగస్ట్​ 28 ఏం ప్రకటన?

ఆగస్ట్​ 28 ఏం ప్రకటన?
  • అంబానీపైనే వ్యాపార వర్గాల దృష్టి

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్​అంబానీ ఆగస్టు 28న పెద్ద ప్రకటన చేయబోతున్నట్లు కంపెనీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. కానీ ఆ ప్రకటన ఏందనేది బయటికి పొక్కడంలో లేదు. అదే రోజున కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరగనుంది. రిలయన్స్ గ్రూప్ కొత్త కంపెనీ అయిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిస్టింగ్‌కు సంబంధించిన వివరాలను ఈసారి ఆయన ప్రజల ముందు ఉంచవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖేష్ అంబానీ ఇంతకుముందు రిలయన్స్ జియో, రిలయన్స్ జియో ఫోన్, జియో ఫైబర్ వంటి అనేక పెద్ద ప్రకటనలను కంపెనీ తన వార్షిక సర్వసభ్య సమావేశంలోనే చేయడంతో ఈసారి కూడా ఏదో ఒక పెద్ద ప్రకటన చేస్తారని వ్యాపార వర్గాలు బెంబేలెత్తిపోతున్నాయి. ఆయన ఏ ప్రకటన చేసినా మార్కెట్​లో బీభత్సమైన క్రేజ్​ఆయా వాటిపై ఉండడం విశేషం.  ఈసారి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్ల జాబితాకు సంబంధించిన వివరాలను ఏజీఎంలో పంచుకుంటే ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ కొత్త కంపెనీ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కావడం ఇదే మొదటిసారి. కాగా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (జేఎఫ్​ఎస్) జాబితా తర్వాత ఇది దేశంలో అతిపెద్ద నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ. ఇటీవల కంపెనీ 2022-–23 ఆర్థిక సంవత్సరానికి వార్షిక ఫలితాలను ప్రకటించిన విషయం విదితమే.