పారిస్‌లో పేలుడు..

పారిస్‌లో పేలుడు..
  • 40 మందికి గాయాలు

పారిస్​: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో రూ సెయింట్-జాక్వెస్‌లో ఉన్న ఒక డిజైన్ స్కూల్, క్యాథలిక్ విద్యా వ్యవస్థ ప్రధాన కార్యాలయ భవనంలో భారీ పేలుడు చోటు చేసుకోవడంతో తీవ్ర కలకలం చోటు చేసుకుంది. ఈ పేలుడులో సుమారు గాయాలపాలైన వారి సంఖ్యలో స్పష్టత లేదు. అధికార వర్గాలు 16 మందికి గాయాలయినట్లు, ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంటున్నా.. పారిస్​ వార్త సంస్థలు మాత్రం ఇందుకు భిన్నంగా 40 మందికి గాయాలైనట్లు పేర్కొంటున్నాయి. పేలుడు ఘటన జరిగిన వెంటనే పోలీసులు చుట్టుపక్కల భవనాలను ఖాళీ చేయించారు. రెస్క్యూ బృందాలు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ పేలుడు దేనివల్ల జరిగిందనే విషయంపై ఇంకా అధికార వర్గాలు వెల్లడించలేదు. పేలుడు ఘటన అనంతరం మంటలను ఆర్పేందుకు మొత్తం పెద్ద ఎత్తున ఫైరింజన్ల నీటిని వాడుకున్నట్లు అధికారులు తెలిపారు. పేలుడు ప్రభావం చుట్టుపక్కల భవనాలపై కూడా స్వల్పంగా పడడంతో ఆ భవనాల అద్దాలు కూడా ధ్వంసమవుతూ కింద పడుతున్నాయి. ఈ విషయంపై పారిస్​పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.