ఇంకా లభించని సబ్​మెరైన్​ ఆచూకీ!

ఇంకా లభించని సబ్​మెరైన్​ ఆచూకీ!
  • ఆక్సిజన్​ ఖాళీ.. గాలింపు చర్యలు ముమ్మరం

అట్లాంటిక్​:-ఆర్థిక దిగ్గజాలతో టైటానిక్​ ప్రాంత శకలాలను చూసేందుకు ఓషన్‌గేట్ ఎక్స్‌పెడిషన్స్ కు చెందిన సబ్ మెరైన్ జాడ ఇంకా లభించలేదు. గురువారం సాయంత్రం 4.30 గంటల వరకూ ఇందులో సరిపడా ఆక్సిజన్​ ఉండడంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతుంది. సబ్​మెరైన్​ జాడ కోసం అమెరికా రక్షణ రంగానికి చెందిన ప్రత్యేక బృందాలు తీవ్రంగా వెతుకుతున్నాయి. సబ్​మెరైన్​కు సంబంధించిన సిగ్నల్స్​ అందుతున్నప్పటికీ అవి ఎక్కడి నుంచి అందుతున్నాయి. ఎంత దూరం నుండి వస్తున్నాయనే విషయంలో గాలింపు బృందాలకు స్పష్టత దొరకడం లేదు. గాలింపు చర్యలు కాస్త దశ, దిశ లేనట్లుగా కొనసాగిస్తున్నాయనే ఆరోపణలూ లేకపోలేదు. ఈ సబ్​మెరైన్​లో ఐదుగురు ప్రయాణికులున్నారు. సోనార్ నీటి అడుగున గుర్తుతెలియని శబ్దాలను నిపుణులు గుర్తించారు. దీంతో కోస్ట్ గార్డ్ అధికారులు సబ్​మెరైన్​ జాడ కనిపెడతామన్న ధీమాలో ఉన్నా, ఆక్సిజన్​ అయిపోయే సమయం ఆసన్నం కావడంతో ఆందోళన నెలకొంది. అందులో ఉన్న సిబ్బందిని సజీవంగా గుర్తించడం, వారిని వెలికితీయడం సవాలుగా మారింది. కాగా సముద్రం నుంచి వస్తున్న సిగ్నల్స్​పై నిపుణుల మధ్యే భిన్నవాదనలు నెలకొన్నాయి. సబ్​మెరైన్​వి కావని కొందరు నిపుణులు భావిస్తుంటే, మరికొందరేమో అవి ఖచ్చితంగా సబ్​మెరైన్​నుంచి అందుతున్న సిగ్నల్సే అని అనుకూంటూండడం విశేషం. 

1912 ఏప్రిల్ 14, 15 తేదీల మధ్యరాత్రి టైటానిక్ అట్లాంటిక్ మహాసముద్రంలో కేవలం మూడు గంటల్లో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు 1500,650 మంది ప్రాణాలు కోల్పోయారు. కెనడాకు 3 కిలోమీటర్ల దూరంలో 3,843 మీటర్ల లోతులో నౌక రెండు ముక్కలుగా చీలి మునిగిపోయింది. రెండు ప్రాంతాలు ఒకదానికొకటి 800 మీటర్ల దూరంలో ఉన్నాయి. జేమ్స్ కామెరూన్ టైటానిక్ సినిమా తీసిన తర్వాత టైటానిక్ ఖ్యాతి చెక్కుచెదరకుండా నిలిచిపోయింది. ఆ సమయంలోనే అది అక్కడి హిమానీనదాల్లో కూలిపోయినట్లు వారు గుర్తించారు.