టీటీపీ ఆధీనంలో పాక్​ గ్రామాలు 

టీటీపీ ఆధీనంలో పాక్​ గ్రామాలు 
  • నలుగురు పాకిస్తాన్​సైనికుల మృతి
  • ఏడుగురికి గాయాలు

ఖబర్​ఫంక్తువ్వా: పాక్​లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పాక్–అఫ్ఘాన్​ సరిహద్దున ఉన్న ఖైబర్ ఫంక్తువాల్లోని పలు గ్రామాలను టీటీపీ (తెహ్రిక్​ ఏ తాలిబాన్ పాకిస్థాన్) స్వాధీనం చేసుకుంది. వీరిని అడ్డుకునేందుకు సైన్యం ప్రయత్నించగా ఉగ్రవాదులు వారిపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో నలుగురు సైనికులు మృతి చెందగా, ఏడుగురికి గాయాలయ్యాయి. ఆఫ్ఘానిస్థాన్‌ సరిహద్దుకు సమీపంలోని రెండు చెక్‌పోస్టులపై తాలిబన్‌ ఉగ్రవాదులు గురువారం దాడికి పాల్పడ్డారు. అనంతరం సరిహద్దుకు దగ్గరలో ఉన్న గ్రామాల్లోకి ఆయుధాలతో ఉగ్రవాదులు స్వైరవిహారం చేస్తూ గ్రామస్తులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారు. గ్రామస్తులు తాము చెప్పిందే వినాలని హుకుం జారీ చేశారు. అమెరికా సైన్యం అఫ్ఘాన్​ను వీడినప్పటి నుంచి తాలిబాన్​గ్రూపులు పగ్గాలు చేపట్టాయి. అప్పటి నుంచి ఆడపిల్లల చదువు, బయట తిరగడం, సినిమాలు, టీవీలు చూడటం తదితర అనేక కార్యక్రమాలపై బ్యాన్​ను విధిస్తూ హుకూం జారీ చేశారు. విననివారిని తుపాకీలతో చంపేస్తున్నారు. చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పటినుంచో పాక్​సరిహద్దు గ్రామాలపై కన్నేసిన తాలిబాన్​లు వీటిని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. వీటిని పాక్​సైన్యం అడ్డుకుంటున్నా, ఓవైపు అంతర్గత ధరల మంట, ఆందోళనలు, మాజీ ప్రధాని ఇమ్రాన్​ఖాన్, సరిహద్దు భద్రత వంటి పరిణామాల నేపథ్యంలో పాక్​ప్రస్తుతం ఆర్థికంగా తీవ్ర గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటుంది. దీన్ని ఆసరాగా చేసుకున్న టీటీపీ ఉగ్రమూకలు సమయం చూసి పంజా విసిరాయని పలువురు పాక్​ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరికి సరైన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. స్వాధీనం చేసుకున్న గ్రామాల్లో ఉన్న ఉగ్రమూకల్ని ఏరివేసేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపినట్లు అధికారులు వెల్లడించారు.