ఢిల్లీ ఆర్డినెన్స్​బిల్లుకు  లోక్​సభ ఆమోదం

ఢిల్లీ ఆర్డినెన్స్​బిల్లుకు  లోక్​సభ ఆమోదం
  • మణిపూర్ ఘటనపై ఇరుసభల్లో గందరగోళం
  • ఢిల్లీ గురించి ఆలోచించాలి: అమిత్ షా
  • రాష్ర్ట అధికారాలు కేంద్రానికి తాకట్టు: ఆప్​

న్యూఢిల్లీ: పార్లమెంట్, రాజ్యసభల్లో గందరగోళం కొనసాగుతూనే ఉంది. ఓ వైపు మణిపూర్ అంశంపై చర్చ చేపట్టాలని, ప్రధాని వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండగా, మరోవైపు కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ ఆర్డినెన్స్​బిల్లును పెట్టడం అనైతికమని ఆప్​ ఆరోపించింది. ఆప్​కు ఇండియా కూటమి నేతలు మద్దతు పలకడంతో ఈ బిల్లుపై చర్చకు విపక్షాలు పట్టుపట్టి వాకౌట్​ చేశాయి. కాగా గురువారం లోక్​సభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై సుదీర్ఘ చర్చ అనంతరం కేంద్రం బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించింది. సోమవారం ఈ బిల్లును రాజ్యసభలో పూర్తి మెజార్టీతో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభలో బీజేపీతో కొత్తగా వైఎస్సార్సీపీ, ఎన్సీపీలు కలిసి వస్తుండగా, మరోవైపు పలు పార్టీలు సోమవారం బిల్లుపై ఓటింగ్ దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

  • ‘మణిపూర్’​పై చర్చ జరపండి : ఖర్గే

 రాజ్యసభలో పూర్తి సభ్యుల సంఖ్య 245. ఈ నేపథ్యంలో 123 సభ్యుల మద్దతు అవసరం ఇప్పటికే కావాల్సిన సంఖ్యా బలాన్ని బీజేపీ సాధించిందనే చెప్పొచ్చు. మరోవైపు విపక్ష కూటమిలో పలు పార్టీల గైర్హాజర్ అయితే కూటమి సంఖ్య మరింత తగ్గి సులువుగానే ఢిల్లీ ఆర్డినెన్స్​బిల్లును రాజ్యసభలో ఆమోదం పొందేలా కేంద్రం చేసుకోనుంది. మరోవైపు మణిపూర్​అంశంపై 267 కింద చర్చ జరపాలని కాంగ్రెస్​ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్​ చేశారు. ఈ రూల్​కింద చర్చ చేపడితే మణిపూర్​ అంశంపై ఎక్కువ సమయం చర్చించేందుకు అవకాశం ఉంటుందన్నారు. దీనికి రాజ్యసభ చైర్మన్​జవాబిస్తూ 176 ప్రకారం స్వల్పకాలిక చర్చ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మరోవైపు ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు, డేటా ప్రొటెక్షన్ బిల్లును విపక్షాలు వ్యతిరేకించాయి.

  • ఢిల్లీ బిల్లుపై సీఎం కేజ్రీవాల్ భగ్గు

పార్లమెంట్​లో ఢిల్లీ ఆర్డినెన్స్​బిల్లుపై చర్చ జరిగింది. ఈ బిల్లుపై ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ రాష్ర్టం చేసుకుంటున్న అభివృద్ధిని అడ్డుకునేందుకే ఇలాంటి చర్యలు కేంద్రం తీసుకుందని ఆరోపించారు. ఆ బిల్లుతో ఢిల్లీ హక్కులను కాలరాస్తోందని సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. తాము చేపడుతున్న ప్రతీ అభివృద్ధి పనులకు కేంద్రం మోకాలడ్డుతోందని విమర్శించారు. సుప్రీంకోర్టు చెప్పినా కేంద్రం కుటీల బుద్ధితో వ్యవహరించిందని ఆరోపించారు. ఈ సందర్భంగా అమిత్​షా మాట్లాడుతూ ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్ర హోదాను ఇవ్వాలన్న డిమాండ్‌ను జవహర్​లాల్​ నెహ్రూ, అంబేద్కర్ తదితరులు వ్యతిరేకించారని చెప్పారు. ఇటీవలే ఏర్పాటైన ఇండియా ఇండియాపై మాట్లాడుతూ  మీకు ఎన్ని కావాలంటే అన్ని కూటములను ఏర్పాటు చేసుకోండి. మోడీ సంపూర్ణ ఆధిక్యతతో మళ్లీ అధికారంలోకి వస్తారని చెప్పారు.