ఇంకా విషమంగానే ప్రీతి ఆరోగ్య పరిస్థితి

ఇంకా విషమంగానే ప్రీతి ఆరోగ్య పరిస్థితి

హైదరాబాద్ : వరంగల్‌ కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని డాక్టర్‌ ప్రీతి  హెల్త్ బులిటెన్‌ను నిమ్స్ హాస్పిటల్  వైద్యులు కాసేపటి క్రితం విడుదల చేశారు.  ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా నే ఉందని వైద్యులు తెలిపారు. నాలుగు రోజులుగా ప్రీతికి చికిత్స జరుగుతోంది. అయినా ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఇంకా ఎక్మో సపోర్ట్‌తో వెంటిలేటర్‌పై ఉంచి ప్రీతికి చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. ప్రీతిని కాపాడేందుకు తీవ్రంగా యత్నిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఈ మేరకు డీఎంహెచ్‌వోకు వైద్యుల బృందం నివేదికను అందజేసింది. ప్రీతి ఆత్మహత్యాయత్నంపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ కేసు నమోదు చేసింది.