దళిత జర్నలిస్టులు సమన్వయంతో పనిచేయాలి

దళిత జర్నలిస్టులు సమన్వయంతో పనిచేయాలి

ఆవేశంతో కాదు, ఆలోచనతో ముందడుగు వేయండి
కనకాల కట్టమైసమ్మకు కుమ్మరి సంఘం మహిళల తొలి బోనం
హాజరై పూజలు నిర్వహించిన మంత్రి తలసాని, ఎమ్మెల్యే ముక్కాగోపాల్, మాజీ కార్పొరేటర్ వి ఎస్ ఆర్

ముద్ర, ముషీరాబాద్: మన సంస్కృతి కి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలు, బతుకమ్మ వేడుకలు నేడు విశ్వవ్యాప్తం అయ్యాయని, ఇది మనకెంతో గర్వకారణమని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం లోయర్ ట్యాంక్ బండ్ లోని జగదీష్ మందిర్ వద్ద కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై పూజలు నిర్వహించి బోనాల ఊరేగింపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర పండుగగా ప్రకటించారని, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తూ పండుగను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నో సంవత్సరాల నుండి జరుపుకుంటున్న బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని కోరుతూ వస్తున్నప్పటికీ గత పాలకులు పట్టించుకోలేదన్నారు. ఈ నెల 22 వ తేదీన గోల్కొండ లో బోనాలు ప్రారంభం అయ్యాయని, వచ్చే నెల 9న సికింద్రాబాద్ బోనాలు, 16 వ తేదీన ఓల్డ్ సిటీ బోనాలు జరుగుతాయని వివరించారు. బోనాల ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని వివిధ దేవాలయాలకు ఆర్ధిక సహాయం అందించడం కోసం ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు విడుదల చేసిందని చెప్పారు. 

దేశంలో ఒక్క తెలంగాణ లో మాత్రమే ప్రయివేట్ దేవాలయాలకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తుందని చెప్పారు. ప్రభుత్వం సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ వాటి పరిరక్షణకు కృషి చేస్తుందని తెలిపారు. ప్రజలు సంతోషంగా ఉండాలి, పండుగలను గొప్పగా జరుపుకోవాలి అనేది ముఖ్యమంత్రి ఆలోచన అన్నారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి కుమ్మరి సంఘం మహిళలు తొలి బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని వారికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు. వందలాదిమంది కుమ్మరి సంఘం మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకొని ఊరేగింపుగా లోయర్ ట్యాంక్బండ్ లోని జగదీష్ మందిర్ నుంచి కట్ట మైసమ్మ దేవాలయం వరకు మేళ తాలాలతో, భాజా భజంత్రీలతో తరలి వెళ్లారు. అనంతరం సాంప్రదాయబద్ధంగా కనకాల కట్ట మైసమ్మ తల్లికి తొలి బోనం సమర్పించారు. పఈ కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గోకులం కృష్ణమోహన్ రావు, మాజీ కార్పొరేటర్ విఎస్ఆర్, బిఆర్ఎస్ నేత ఎం.ఎన్. శ్రీనివాసరావు, తెలంగాణ కుమ్మర సంఘం అధ్యక్షులు జయంత్ రావు, బోనాల కమిటీ చైర్మన్ నిమ్మలూరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి దయానంద్, నాయకులు లక్ష్మీనారాయణ, నాగేష్, కూజాల హనుమంతరావు, నిదునూరి శ్రీనివాసులు తదితర కుమ్మరి సంఘం నాయకులు పాల్గొన్నారు.