ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అతిపెద్ద ఉపశమనం..

ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అతిపెద్ద ఉపశమనం..
Biggest relief for income tax payers

కొత్త ఆదాయపు పన్ను విధానంలో రూ. 3 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 3 నుంచి 6 లక్షల రూపాయల మధ్య ఆదాయంపై 5% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రూ.6 నుంచి 9 లక్షల మధ్య ఆదాయంపై 10 శాతం, రూ. 9 నుంచి 12 లక్షల మధ్య ఆదాయంపై 15 శాతం, రూ. 12 నుంచి 15 లక్షల మధ్య ఆదాయంపై 20 శాతం, రూ. 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయంపై 30 శాతం ఆదాయపు పన్ను ఉంటుంది.

ట్యాక్స్​ రిటర్న్​ ప్రాసెసింగ్​
ట్యాక్స్​ రిటర్న్​ ప్రాసెసింగ్​ను 90 రోజుల నుంచి రీఫండ్ ప్రక్రియను16 రోజులకు తగ్గించామని.. ఒక్కరోజులోనే 72 లక్షల పన్ను రిటర్న్‌లు దాఖలయ్యాయని ఆర్థిక మంత్రి తెలిపారు. పన్ను చెల్లింపుదారుల ఫిర్యాదుల పరిష్కారం మెరుగుపడింది. సాధారణ IT రిటర్న్ ఫారమ్‌లు వస్తాయి. ఇది రిటర్న్ ఫైలింగ్‌ను సులభతరం చేస్తుంది.  ఇకపై రూ.7 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండదని ఆర్థిక మంత్రి తెలిపారు. ఇది కొత్త పన్ను విధానంలో ఇవ్వబడుతుంది.