ఉమేశ్​పాల్​ హత్యలో రెండో చార్జీషీటు దాఖలు

ఉమేశ్​పాల్​ హత్యలో రెండో చార్జీషీటు దాఖలు
  • 8మందిపై అభియోగాలు

యూపీ: ఉమేశ్​పాల్​ హత్య కేసులో పోలీసులు సోమవారం 8మందిపై రెండో ఛార్జీషీటు దాఖలు చేశారు. తొలుత దాఖలు చేసిన చార్జీషీటులో హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్నవారిపేర్లను మాత్రమే చేర్చిన పోలీసులు పలువురిని మరింత లోతుగా విచారించిన అనంతరం పరోక్షంగా పాల్గొన్న 8 మందిపై కేసు నమోదు చేసి చార్జీషీటు దాఖలు చేసింది. ఈ హత్యలో ఇప్పటికే నాలుగు ఎన్​కౌంటర్లలో ప్రత్యక్షంగా పాల్గొన్నవారిని పోలీసులు మట్టుబెట్టారు. 12యేళ్లముందు రాజుపాల్​ హత్య జరిగింది. ఈ హత్యలో అతీక్​అహ్మద్​ నిందితుడిగా ఉండగా, ప్రధాన సాక్షిగా ఉమేశ్​పాల్​ఉన్నాడు. ఫిబ్రవరి 8న ఉమేశ్​పాల్​ను, అతనికి భద్రత కల్పిస్తున్న ఇద్దరు పోలీసులను అతీక్​ అండ్​ కో గ్యాంగ్​ నడిరోడ్డుపై కాల్పులకు తెగబడి హత్య చేశారు. ఈ విషయాన్ని సీరియస్​గా తీసుకున్న యూపీ ప్రభుత్వం యూపీలో మాఫియాను మట్టిలో కలిపేస్తామని సాక్షాత్తూ సీఎం యోగి అసెంబ్లీ సాక్షిగా తెలిపారు. ఆయన ప్రకటించినట్టే ఎన్​కౌంటర్లు జరిగాయి. అతీక్​తోబాటు అతని గ్యాంగ్​ సభ్యులు, కుమారుడు కూడా ఎన్​కౌంటర్​లో మృతిచెందారు.