26న తిరుమలగిరికి కెటిఆర్ రాక 

26న తిరుమలగిరికి కెటిఆర్ రాక 
  •  తుంగతుర్తి ప్రగతి నివేదన సభను విజయవంతం చేయాలి..

ముద్ర తిరుమలగిరి:-ఈనెల 26న తిరుమలగిరి మండల కేంద్రంలో జరిగే తుంగతుర్తి ప్రగతి నివేదన సభను విజయవంతం చేయాలని  తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ కోరారు మంగళవారం నాడు తిరుమలగిరి పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన  మాట్లాడుతూ ఈనెల 26న తేదీన సాయంత్రం 4 గంటలకు తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో జరిగే తుంగతుర్తి ప్రగతి నివేదన సభకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి & బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు . రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి హాజరుకానున్నారనీ చెప్పారు  తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. తిరుమలగిరి మున్సిపాలిటీకి మంజూరైన 20 కోట్ల అభివృద్ధి నిధులతో మున్సిపల్ నూతన భవనం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ .సిసి రోడ్ల నిర్మాణ పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారని ఆయన తెలిపారు అదే రోజు సాయంత్రం జరిగే బహిరంగ సభకు తరలిరావాలని కోరారు.

తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి జన సమీకరణకు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఈ సభకు రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ తో పాటు ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్లు జిల్లా పార్టీ అధ్యక్షుల ను ఆహ్వానిస్తున్నామని ఆయన చెప్పారు
ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సంకేపల్లి రఘునందన్ రెడ్డి, ఎంపీపీ స్నేహలత, మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్, నాయకులు మామిడి సర్వయ్య, దూపటి రవీందర్, ‌వివిధ వార్డుల కౌన్సిలర్లు, నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.