తుంగతుర్తి దేవాలయానికి విరాళంగా ఆంజనేయ స్వామి విగ్రహం

తుంగతుర్తి దేవాలయానికి విరాళంగా ఆంజనేయ స్వామి విగ్రహం

తుంగతుర్తి ముద్ర: తుంగతుర్తి మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి రామచంద్రస్వామి దేవాలయానికి సుమారు 50 వేల రూపాయల విలువగల శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని బుక్కా లక్ష్మయ్య ,భాగ్యలక్ష్మి దంపతులు విరాళంగా అందించారు.ఈ సందర్భంగా కార్యనిర్వహణ అధికారి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, భక్తులు ఆలయ అభివృద్ధికి సహకరించడం హర్షదాయకమని ఆంజనేయ స్వామి విగ్రహాన్ని విరాళంగా ఇవ్వడం సంతోషకరమని అన్నారు .ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కాటూరి రామాచార్యులు ,జూనియర్ అసిస్టెంట్ పన్నాల శ్రీనివాసరెడ్డి ,స్థానిక పూజారి శేషశర్మ, చైర్మన్ ముత్యాల వెంకటేశ్వర్లు ,గ్రామ ప్రముఖులు పాలవరపు సంతోష్ ,కాసం మల్లయ్య, కేదారి లతోపాటు పలువురు భక్తులు, తదితరులు పాల్గొన్నారు లతోపాటు భక్తులు పాల్గొన్నారు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.