సర్వే పేరుతో యువకుల హల్​చల్​...  కాంగ్రెస్ కార్యకర్తల దేహశుద్ధి 

సర్వే పేరుతో యువకుల హల్​చల్​...  కాంగ్రెస్ కార్యకర్తల దేహశుద్ధి 

తుంగతుర్తి,  ముద్ర: తుంగతుర్తి నియోజకవర్గంలోని  నూతనకల్ మండలంలో  కొంతమంది యువకులు  తాము పీసీసీ  నుండి వచ్చామని,  కాంగ్రెస్ అభ్యర్థుల గురించి  సర్వే చేస్తున్నామని చెబుతూ  గ్రామాల్లో సర్వే ఫామ్స్ పట్టుకొని తిరుగుతుండగా కొంతమంది కాంగ్రెస్  కార్యకర్తలు  వారిని పట్టకొని  దేహశుద్ధి చేయగా తప్పించుకొని పరారైనట్లు సమాచారం.   సర్వేలో ఇద్దరు  ఆశావహ అభ్యర్థుల పేర్లు  మాత్రమే ఉన్నాయని,  జాబితాలో పలు ప్రశ్నలు నమోదు చేసి వాటికి సమాధానాలు అడుగుతుండగా  గ్రామ యువకులు అడ్డు తగలడంతో  పలాయనం చిత్తగించినట్లు  సమాచారం.  ఒకరు గతంలో పోటీ చేసి ఓడిపోయిన అద్దంకి దయాకర్  కాగా,  మరొకరు సూర్యాపేటకు చెందిన అనుములపూరి రవిబాబుగా సర్వే ఫామ్ లో కనిపిస్తోంది.  ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అధికారిక సర్వేనా ? లేక ఇది ఫేక్ సర్వేనా ?లేక ఎవరైనా అభ్యర్థి పేర సర్వే చేయించుకుంటున్నారా? అనేది తేలాల్సి ఉంది .