గండూరి క్ర్రపాకర్ ఆధ్వర్యంలో  రోగులకు సంవత్సరం పాటు అల్పాహారం పంపిణీ హర్షణీయం

గండూరి క్ర్రపాకర్ ఆధ్వర్యంలో  రోగులకు సంవత్సరం పాటు అల్పాహారం పంపిణీ హర్షణీయం

విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: సమాజంలో తన వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బిఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు గండూరి క్ర్రపాకర్ ఆధ్వర్యంలో  సంవత్సరం పాటు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నందు రోగులకు అల్పాహారం కార్యక్రమం నిర్వహించడం హర్షణీయమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.  గండూరి రామస్వామి జానకమ్మ, గండూరి సత్యనారాయణ, జోనాల జ్ణాపకార్ధం బిఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు గండూరి క్ర్రపాకర్ ఆధ్వర్యంలో సంవత్సరం పాటు నిర్వహించనున్న  అల్పాహారం కార్యక్రమాన్ని మంత్రి   జగదీష్ రెడ్డి ఆదివారం ఉదయం ప్రారంభించారు. 

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, బిఆర్ ఎస్ పార్టి రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు గండూరి ప్రకాష్, బైరు వెంకన్న,  పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ,  జిల్లా క్లాత్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి శంకర్,  45 వ వార్డు  కౌన్సిలర్ గండూరి పావని క్ర్రపాకర్,  లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ దేవిరెడ్డి రవీందర్ రెడ్డి, సెక్రటరీ రంగు దిలీప్ కుమార్, ట్రెజరర్ బెజగం ఫణి, బండారు రాజా, నూకల వెంకట రెడ్డి, రాచకొండ శ్రీనివాస్, వాంకుడోతు వెంకన్న, మీలా వంశి, బజ్జూరి శ్రీనివాస్, తెరటపల్లి సతీష్, భోనగిరి విజయ్, మిర్యాల సుధాకర్, గుండా శ్రీధర్, వుల్లి రామాచారి,మంచాల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.