రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాజకీయ కమిటీ వైస్ చైర్మన్ గా వెంపటి వెంకటేశ్వర రావు నియామకం

రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాజకీయ కమిటీ వైస్ చైర్మన్ గా వెంపటి వెంకటేశ్వర రావు నియామకం

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాజకీయ కమిటీ వైస్ చైర్మన్ గా వెంపటి వెంకటేశ్వరరావు నియామకమయ్యారు. ఈ మేరకు హైదరాబాదులోని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అమరవాధి లక్ష్మీనారాయణ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. వీరు గతంలో సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ రాజకీయ కమిటీ చైర్మన్ బాధ్యతలు నిర్వహించి ఆ పదవికే వన్నె తేవడంతో పాటు ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదుగుటకు తమ వంతు కృషి చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాజకీయ కమిటీ వైస్ చైర్మన్ గా నియామకమైన సందర్భంగా పలువురు జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాపై నమ్మకంతో రాజకీయ కమిటీ వైస్ చైర్మన్ నియమించినందుకు అమరవాది లక్ష్మీనారాయణకు, సహకరించినందుకు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మా శెట్టి అనంతరాములకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు. ఆర్యవైశ్యులు సామాజిక వ్యాపార రంగంతో పాటు రాజకీయరంగంలో సైతం రాణించే విధంగా తన  కృషి కృషి చేస్తానని తెలిపారు.