హైదరాబాద్ - విజయవాడ ప్రధాన రహదారి జలదిగ్బంధం

హైదరాబాద్ - విజయవాడ ప్రధాన రహదారి జలదిగ్బంధం
  • వాహనాలు రాకపోకలకు అంతరాయం
  • ఉగ్ర రూపం దాల్చిన మున్నేరు వాగు - ఎన్టీఆర్ జిల్లా ఐతవరం వద్ద రోడ్డు పైకి వరద నీరు
  • ఈ రోజు సాయంత్రానికి పరిస్థితులు చక్కబడే అవకాశం

ముద్ర ప్రతినిధి , కోదాడ: హైదరాబాద్ - విజయవాడ ప్రధాన రహదారి ఎన్ ఎచ్ 65 పై ఎన్టీఆర్ జిల్లా ఐతవరం వద్ద కీసర టోల్ ప్లాజా సమీపంలో గల మున్నేరు వాగు ఉదృతంగా ప్రవహించటం , వరద నీరు రోడ్డు పైకి భారీగా చేరటంతో హైదరాబాద్ - విజయవాడ కు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు .

గత మూడు రోజులుగా తెలంగాణా అంతట విస్తారంగా భారీ వర్షాలు కురవటంతో పాటు వరంగల్ జిల్లాలో అధికంగా కురిసిన వర్షాలకు పాకాల , బుడమేరు , ఆకేరు , పాలేరు వాగు వరద తీర్ధాల వద్ద మున్నేరు లో కలవటం తో మున్నేరు ఉగ్రరూపం దాల్చటంతో భారీ నీటి ప్రవాహాం వలన ఇప్పటికే ఖమ్మం మున్నేరు వాగు పాత బ్రిడ్జి పైన కూడా రాకపోకలకు అనుమతించట్లేదు .

మున్నేరు ఉదృతికి ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని వల్లాపురం , గంధసిరి , పెద్దమండవ గ్రామాలలోని పొలాలు నీట మునగగా గ్రామాలలోకి కూడా వరద నీరు చేరింది . అలాగే ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మున్నేరు బ్రిడ్జి పైకి వరద నీరు చేరటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది , ఇది మున్నేరు వాగు కీసర వద్ద కూడా వరద నీరు రోడ్డు పైకి చేరటంతో రెండు రాష్ట్రాల మధ్య గల ప్రధాన రహదారిపై వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది , దీనితో వాహనాలను తెలంగాణా రాష్ట్ర సరిహద్దు అయిన కోదాడ నుండి వయా మిర్యాలగూడ - పిడుగురాళ్ల - సత్తనపల్లి - గుంటూరు - విజయవాడ వైపు గ వాహనాలను మళ్లిస్తున్నారు . తెలంగాణ లో వర్షాలు తగ్గుముఖం పట్టటం తో శుక్రవారం సాయంత్రానికి మున్నేరు వరద తగ్గుతుందని తిరిగి వాహనాలు రాకపోకలను పునరుద్ధరిస్తామని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు .