వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో  డిస్ట్రిక్ట్  గవర్నర్ విజిట్ లో సేవా కార్యక్రమం

వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో  డిస్ట్రిక్ట్  గవర్నర్ విజిట్ లో సేవా కార్యక్రమం
  • ఆలేటి ఆటం అనాధాశ్రమానికి 50,000/- విరాళంగా ఇచ్చిన శ్రీరంగం రాము

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-వాసవి యూత్ క్లబ్ ప్రెసిడెంట్ యామా సంతోష్ ఆధ్వర్యంలో  డిస్ట్రిక్ట్   104ఎ గవర్నర్ పర్యటనలో భాగంగా దురాజ్ పల్లిలోని ఆలేటి ఆటం అనాధాశ్రమం నందు  సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు శ్రీరంగం రాము సోదరులు తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఆలేటి ఆశ్రమం లో గది నిర్మాణం కొరకు విరాళంగా ఇచ్చిన 50,000/-  చెక్కును వాసవి క్లబ్ గవర్నర్ గురుమూర్తి చేతులమీదుగా నిర్వాహకులకు  అందజేసినారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గురుమూర్తి మాట్లాడుతూ వాసవి క్లబ్స్ సూర్యాపేట ఆధ్వర్యంలో నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సూర్యాపేట వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాల నుండి అమావాస్య అన్నదానం కార్యక్రమం నిర్వహించడం పట్ల వాసవి క్లబ్  ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పాలకుర్తి గాయత్రి అభినందనలు తెలిపారని ఆయన అన్నారు. వాసవి క్లబ్స్ సూర్యాపేట ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకు నోట్ బుక్స్ పంపిణీ, మహిళలకు కుట్డు మిషన్ ల పంపిణీ, చీరల పంపిణీ, పేద మహిళలకు ఆర్దిక సహాయం చేయడంతో  పాటు జవాన్లకు సన్మానం చేయడం పట్ల అభినందనలు తెలిపారు.  సూర్యాపేట వాసవి క్లబ్స్ లో పిఎస్ టిలు , సభ్యులు కలిసిమెలిసి పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో  వాసవి క్లబ్ వైస్ గవర్నర్ రాచర్ల కమలాకర్, ఆర్ సిలు రాచకొండ శ్రీనివాస్, కలకోట లక్ష్మయ్య, యాదా  కిరణ్,  ఐపిసి గుండా శ్రీధర్, డిస్ట్రిక్ట్ ఇంచార్జ్ దేవరశెట్టి సత్యనారాయణ, జెడ్ సిలు మీలా వాసుదేవ్, గుమ్మడవెళ్లి శ్యామ్,  జూలకంటి నాగరాజు,  ఆర్ ఇ సి గుమ్మడవెళ్లి శ్రీకాంత్, తెరటపల్లి సతీష్, శ్రీరంగం రాము, అక్కినపల్లి సత్యనారాయణ, మహంకాళి సోమయ్య తదితరులు పాల్గొన్నారు.