సందడి లేని చెరువుల పండుగ

సందడి లేని చెరువుల పండుగ
  • నేతల మధ్య విభేదాలు... దశాబ్ది ఉత్సవాలకు ఆటంకాలు
  • కానరాని ఉత్సాహం ప్రతివారిలోనూ నిరోత్సాహం
  • హాజరుగానిప్రజాప్రతినిదులు,పార్టీ శ్రేణులు
  • అధికారులు లేకపోతే అట్టర్ ప్లాప్
  • అంతంత మాత్రమే తూతూ మంత్రంగా
  • మండల ప్రజల్లో నిస్తేజం నిర్వేదం

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట:

రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా చేపట్టిన తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు అంతట అంగరంగ వైభవంగా జరుగుతుంటే సూర్యాపేట నియోజకవర్గంలోని ఆత్మకూరు ఎస్ మండలంలో నాయకుల మధ్య విభేదాలు కారణంగా నామమాత్రంగా తూతు మంత్రంగా ఏదో చేయలేదన్నట్టుగా చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి

సూర్యాపేట జిల్లాలో పార్టీ శ్రేణులను అధికారులను సమన్వయ పరుస్తూ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్ని రకాల చర్యలు తీసుకొని ముందుకు కొనసాగుతుండగా ఆత్మకూర్ ఎస్ మండల నాయకులు ప్రజాప్రతినిధులు మాత్రం నిరుత్సాహం నిస్తేజం నిర్వేదం ప్రస్తుతం కనిపిస్తుందని నాయకుల మధ్య విభేదాలు ఇందు కారణమని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అయితే అధికారులు మాత్రం అన్ని రకాల కార్యక్రమాల్లో తప్పదు కదా అని నాయకులు వచ్చినా రాకున్నా ప్రజాప్రతినిధులు పాల్గొన్న పాల్గొనకున్నా తమ వంతు బాధ్యతగా అంటి ముట్టనట్టు వ్యవహరిస్తూ ఎవరిని ఏమీ అనలేక కక్కలేక మింగలేక చావలేక చావు రాక దశాబ్ద ఉత్సవాల్లో పాల్గొంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రo దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం మండల పరిధిలోని 16 గ్రామాల్లో చెరువుల పండుగ కార్యక్రమం నిర్వహించారు. ఇరిగేషన్ శాఖతోపాటు అన్ని శాఖల అధికారులు అంగన్వాడి ఆశ కార్యకర్తలు సమబావన సంఘాలు గ్రామస్థాయి సిబ్బంది ప్రజాప్రతినిదులు హాజరు కావాల్సిఉంది కొన్ని గ్రామాల్లో నేతల మధ్య విభేదాలు ఉత్సవాలను నిరుత్సాహపరుస్తున్నాయి. మండల కేంద్రంలో ఎంపీపీ మర్ల స్వర్ణలత సర్పంచ్ వీరారెడ్డి ఎంపిటిసి వెంకటరెడ్డి నాగలక్ష్మి అదేవిధంగా మరి కొన్ని గ్రామాల్లో సర్పంచులు ఎంపీటీసీలు ఈ కార్యక్రమాలు నిర్వహించారు. కట్ట మైసమ్మ పూజలు బోనాలు బతుకమ్మలు ఆటలతో చెరువుల పూజ నిర్వహించారు.

ఈ దశాబ్ది ఉత్సవాలు 20 రోజులు నిర్వహించాల్సి ఉండగా ఈ ఉత్సవాల కు పార్టీ నేతల్లో సుముఖత కనిపించడం లేదు. ఆత్మకూర్ ఎస్ మండలంలో ఈనెల 7న లక్ష మందితో కాలేశ్వరం గంగా హారతి కార్యక్రమం మంత్రి జగదీశ్ రెడ్డి కోటి నాయక్ తండావద్ద చేపట్టారు. మంత్రి హాజరవుతున్నారని హడావుడి చేసిన ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు తర్వాత మిగతా కార్యక్రమాలకు విముఖత చూపుతున్నారు. జూన్ 2నుండి ప్రారంభమైన దశాబ్ది ఉత్సవాలు మండలంలో అంతగా సందడి కనిపించడం లేదు. గురువారం మండలంలోని 16 గ్రామాల్లో చెరువులు పండుగ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. చెరువు కట్టపై కట్టమైసమ్మకు పూజ నిర్వహించి బతుకమ్మ బోనాలతో ఉత్సవాలు నిర్వహించారు. కొన్ని గ్రామాల్లో అంగన్వాడి, సమ భావన, ఆశా కార్యకర్తలు మాత్రమే కనిపించారు. ఆత్మకూరు మండల కేంద్రంలో ఎంపీపీ మర్ల స్వర్ణలత సర్పంచ్ వీరారెడ్డి ఎంపిటిసి వెంకటరెడ్డి తప్ప వార్డ్ మెంబర్లు పార్టీ కార్యకర్తలు హాజరు కాలేదు.

అదేవిధంగా మరికొన్ని  గ్రామాల్లోనూ పండుగకు స్పందన కరువైంది. మంత్రి జగదీశ్ రెడ్డి దశాబ్ది ఉత్సవాల్లో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలప్రజలను ఉత్సాహపరిచేందుకు తగిన ఏర్పాట్లు చేసినప్పటికీ కిందిస్థాయి పార్టీ నేతల్లో ఉన్న విభేదాలు నిరుత్సాహానికి గురి చేస్తున్నా యి. మరో 12 రోజులు ఉత్సవాలు నిర్వహించాల్సి ఉండగా నాయకుల మధ్యలో ఉన్న విభేదాలు కారణంగా దశాబ్ది ఉత్సవాలు ప్రజల్లో అసంతృప్తినీ మిగిల్చే  అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఉత్సవాల నిర్వహణలో నాయకుల మధ్య విభేదాలు ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా ఐక్యతతో నాయకులు మరింత పట్టుదల పరిశ్రమతో ముందుకు సాగి కలిసిమెలిసి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు ఆ దిశగా పార్టీ పెద్దలు చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం