మైహోం అనుమతుల లొల్లి

మైహోం అనుమతుల లొల్లి
  • మైహోమ్ కు నో పర్మిషన్
  • అన్ని అనుమతులు ఇవ్వాలంటూ అధికారులపై మంత్రి ఒత్తిడి
  • కోర్టు కేసులో ఉన్న భూముల్లో అపార్ట్మెంట్ నిర్మాణాలకు ఆరోసారి అనుమతి తిరస్కరణ
  • గ్రామపంచాయతీ సై డిటిసిపి నై
  • 8కారణాలతో తిరస్కరించిన డిటిసిపి
  • ఫోర్జరీ పత్రాలతో మళ్లీ దరఖాస్తు

మేళ్లచెరువు ముద్ర:పైన ఫోటోలో కనిపిస్తున్న అపార్ట్మెంట్లు సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు రెవెన్యూ పరిధిలోనివి. సర్వేనెంబర్ 1057లో గల భూదాన్, సీలింగ్ భూముల్లో మైహోమ్ సిమెంట్ సంస్థ అక్రమ నిర్మాణాలివి. ఈ భూములపై హైకోర్టులో  కేసులు నడుస్తున్నాయి. ధరణి నిషేధిత జాబితాలోనూ ప్రభుత్వం చేర్చింది. ఐనప్పటికీ బోర్లు వేశారు. విద్యుత్ లైన్లు లాగారు. కనెక్షన్ లు ఇచ్చారు. అన్ని రకాల వసతులతో గృహప్రవేశాలూ చేశారు. ఇందులో వింత ఏంటంటే.. ఇక్కడ కొత్తగా భవనాల నిర్మాణం చేపట్టనున్నట్లు మైహోం సంస్థ దరఖాస్తు చేసుకోవడం.
ఇన్ని అక్రమాలకు పాల్పడ్డ తర్వాత ప్రభుత్వం ఏ విధంగా అనుమతులిస్తుందని గ్రామపంచాయతీ, డిటిసిపి అధికారులు ప్రశ్నిస్తున్నారు.

మైహోం వారసుడి వక్రబుద్దికి కళ్లెం

వివాదాస్పద భూదాన్, ప్రభుత్వ భూములు కావడంతో ఇక్కడ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వలేమని ప్రభుత్వం తేల్చి చెప్పడంతో మైహోం సంస్థ అనుమతులు లేకుండానే ఇష్టారాజ్యంగా భారి అపార్ట్మెంట్ల నిర్మాణం పూర్తి చేసింది.నిర్మాణ పనులు నిలిపివేయాలంటూ గతంలో పలుసార్లు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. నోటీసులను పట్టించుకోని మైహోమ్ సంస్థ ఇప్పుడు అనుమతులు ఇవ్వాలంటూ ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తుంది. భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలంటూ గత ఏడాది ఆగస్టు నుండి మే1,2023వరకు 6సార్లు భవన నిర్మాణ అనుమతుల కోసం జూపల్లి రంజిత్ రావు పేరిట మైహోం సంస్థ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంది. ప్రతిపాదిత భూమిలో ఇప్పటికే భవనాలు ఉండటం,ఆ భూములు సైతం కోర్టు కేసులో ఉండటంతో అనుమతులు ఇవ్వడానికి అవకాశం లేదని 5సార్లు గ్రామపంచాయతీ అధికారులు మైహోం సంస్థ దరఖాస్తును తిరస్కరించారు. ఓ మంత్రి ఒత్తిడితో ఆరోసారి మైహోమ్ దరఖాస్తును గ్రామపంచాయతీ పాలకవర్గం అనుమతించి డిటిసిపికి ఫార్వర్డ్ చేసింది. ఎట్టకేలకు భవన నిర్మాణాలకు గ్రామపంచాయతీ అనుమతించినా డిటిసిపి మాత్రం మైహోమ్ దరఖాస్తును రిజెక్ట్ చేసింది. ఏడుసార్లు తిరస్కరించినా పట్టువిడని విక్రమార్కుల్లా మైహోం వారసుడు అనుమతుల కోసం దరఖాస్తులు సమర్పిస్తూనే ఉన్నారు.

అష్ట దుష్ట దోషాలతో తిరస్కరణ..

మేళ్లచెరువు సర్వేనెంబర్ 1057లో మైహోమ్ సిమెంట్ సంస్థ కొత్తగా నిర్మించనున్న ప్రతిపాదిత అపార్ట్మెంట్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వలేమంటూ డిటిసిపి మైహోమ్ సంస్థ దరఖాస్తు తిరస్కరించింది. ఇందుకు గల 8 కారణాలను డిటిసిపి పేర్కొంది.